Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రెబల్ స్టార్ మీకు ఏమైనా ద్రోహం చేశారా?, మా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?

కర్ణాటక రాష్ట్రంలో రెండు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 26వ తేదీన తొలి దశ ఓటింగ్ జరగనుంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇదే సమయంలో మండ్య రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ నియోజకవర్గంలో దివంగత నటుడు అంబరీష్ పేరును అన్ని పార్టీలు లాగడంతో రెబల్ స్టార్ అంబరీష్ మరోసారి రాజకీయాల్లోకి వచ్చారు.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ-జేడీఎస్ కూటమి ఏర్పడడంతో మండ్య అభ్యర్థిగా కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి రంగంలోకి దిగారు. తిరుగుబాటు వస్తుందని భావించిన బీజేపీ నాయకులు మొహమాటాలు, పంతాలు, పట్టింపులు పక్కనపెట్టి మండ్య సిట్టింగ్ ఎంపీ సుమలత అంబరీష్‌ను శాంతింపజేసేందుకు బీజేపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి కూడా గతంలో జరిగిన రాద్దాంతం మరిచిపోయి మండ్య ఎంపీ సుమలతను కలిసి మద్దతు ఇవ్వాలని ఆమెను కోరారు.

Former CM HD Kumaraswamy along with Mandya MP Sumalatha sought his support

మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి మండ్య ఎంపీ సుమలతను కలిసి మద్దతు కోరిన విషయం గురించి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ బీజేపీ, కుమారస్వామిలను తీవ్రస్థాయిలో విమర్శించారు. కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ చేసిన విమర్శలపై మండ్య సిట్టింగ్ ఎంపీ సుమలత అంబరీష్ విరుచుకుపడ్డారు. తన మద్దతు కోరుతూ హెచ్‌డీ కుమారస్వామి రావడంపై విమర్శలు చేసిన డీసీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై సుమలత కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

2019 ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అభ్యర్థి నిఖిల్ కుమారస్వామిని ఓడించిన తమ బద్ధ శత్రువైన సుమలతను కుమారస్వామి కలిశారని, మండ్య రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై తనకు చాలా ఆసక్తిగా ఉందని డీకేశివకుమార్ చెప్పారు. ఈ విషయంలో సుమలత డీసీఎం డీకే శివకుమార్ ను సూటిగా ప్రశ్నించారు. రెండు దశాబ్దాలుగా సేవ చేసిన మీ కాంగ్రెస్ పార్టీకి నా భర్త అంబరీష్ ఏమైనా ద్రోహం చేశారా ?, నా గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు అంటూ సుమలత కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ ను ప్నశ్నించారు.

Former CM HD Kumaraswamy along with Mandya MP Sumalatha sought his support

ఈ అంశం మండ్యలోని అంబరీష్ అభిమానులు ఎమోషనల్ టర్న్ తీసుకునే అవకాశం ఉందని తెలుసుకున్న డీసీఎం డీకే శివకుమార్ వెంటనే స్పందించారు మండ్య ఎంపీ సుమలత రాజకీయాల్లో తాను ఎప్పటికీ జోక్యం చేసుకోబోనని స్పష్టం చేశారు. అంబరీష్‌కు కాంగ్రెస్ ఏం ఇచ్చిందో దేశం మొత్తానికి తెలుసు అని డీకే శివకుమార్ అన్నారు. సిట్టింగ్ ఎంపీ సుమలత బుధవారం ఏప్రిల్ 3వ తేదీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలా లేక బీజేపీలో చేరాలా అనే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

మండ్యలో విజయం సాధించాలని అనుకున్న హెచ్‌డీ కుమారస్వామిని సుమలతను కలిసి మద్దతు కోరారు. బెంగుళూరులోని సుమలత నివాసంలో మంగళవారం ఈ సమావేశం జరిగింది. సుమలత తన సోదరి అని, నటుడు అంబరీష్‌ని తన బెస్ట్ ఫ్రెండ్ అని మజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి బహిరంగంగా చెప్పారు. సుమలతను అక్కా అంటూ మాజీ సీఎం కుమారస్వామి పలకరించడం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+