గాలి జనార్దన్ రెడ్డి దెబ్బకు మాజీ సీఎం, మైనింగ్ కేసులో రూ.150 కోట్లు లంచం, నో బెయిల్!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్ణాటకలోని జంతకల్ మైనింగ్ కంపెనీ కేసు విచారణకు సంబంధించి ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మంగళవారం (జూన్ 13వ తేదీ) బెంగళూరులోని లోకాయుక్త ప్రత్యేక దర్యాప్తు అధికారులు (ఎస్ఐటీ) ముందు హాజరైనారు.

ఫోన్ రిసీవ్ చెయ్యలేదని ప్రభుత్వ మహిళా ఉద్యోగిపై దాడి: వేడుకుంటున్నా (వీడియో)

జంతకల్ మైనింగ్ కంపెనీ పనులు మళ్లీ ప్రారంభించడానికి 2007లో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి తదితరులు కంపెనీ నిర్వహకుల నుంచి రూ. 150 కోట్లు లంచం తీసుకున్నారని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సీఎం తదితరులు రూ. 150 కోట్లు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

గాలి ముఖంలో చిరునవ్వు !

గాలి ముఖంలో చిరునవ్వు !

మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మంగళవారం బెంగళూరులోని ప్రత్యే దర్యాప్తు సంస్థ అధికారులు (ఎస్ఐటీ) ముందు హాజరయ్యారు. ఎస్ఐటీ కార్యాలయం దగ్గరకు వస్తున్న సమయంలో గాలి జనార్దన్ రెడ్డి చిరునవ్వుతో దర్శనం ఇచ్చారు.

సాక్షాలు ఇచ్చిన గాలి !

సాక్షాలు ఇచ్చిన గాలి !

ఎస్ఐటీ కార్యాలయం దగ్గర కు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడకుండా నేరుగా లోపలికి వెళ్లిపోయారు. తరువాత ఎస్ఐటీ అధికారులకు సాక్షాలు సమర్పించారని తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి రూ. 150 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపించిన గాలి జనార్దన్ రెడ్డి అందుకు సంబంధించిన సాక్షాలు ఇచ్చారని సమాచారం.

గాలి దెబ్బతో మాజీ సీఎంకు నో బెయిల్ !

గాలి దెబ్బతో మాజీ సీఎంకు నో బెయిల్ !

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాలని ప్రత్యేక కోర్టులో అర్జీ సమర్పించారు. మంగళవారం అర్జీ విచారణ జరిగింది. అదే రోజు కుమారస్వామికి వ్యతిరేకంగా గాలి జనార్దన్ రెడ్డి ఎస్ఐటీ అధికారులు సాక్షాలు సమర్పించారు. అయితే కుమారస్వామి ముందస్తు బెయిల్ కోసం సమర్పించిన అర్జీని ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. ముందస్తు బెయిల్ ఇవ్వలేమని ప్రత్యేక కోర్టు తేల్చి చెప్పింది.

గాలికి డబుల్ ఢమాకా !

గాలికి డబుల్ ఢమాకా !

మే నెలలో ఎస్ఐటీ అధికారుల ముందు హాజరైన గాలి జనార్దన్ రెడ్డి కుమారస్వామి మీద తాను చేసిన ఆరోపణలకు పక్కా ఆధారాలు ఇవ్వాలంటే 15 రోజులు సమయం కావాలని మనవి చేశారు. 15 రోజులు కాదు 30 రోజులు సమయం తీసుకుని మీ దగ్గర ఉన్న సాక్షాలు సమర్పించాలని అధికారులు గాలి జనార్దన్ రెడ్డికి సూచించారు.

 గాలి దెబ్బతో బీజేపీ సుడి తిరుగుతుందా ?

గాలి దెబ్బతో బీజేపీ సుడి తిరుగుతుందా ?

2018లో కర్ణాటక లో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఒక సంవత్సరం కూడా సమయంలో లేని సందర్బంలో కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ పార్టీల మధ్య ఇప్పుడు అక్రమ మైనింగ్ వార్ మొదలైయ్యింది. గాలి జనార్దన్ రెడ్డి పక్కా ఆధారాలు ఇస్తే మాత్రం మాజీ సీఎం కుమారస్వామికి కష్టాలు తప్పవని న్యాయనిపుణలు అంటున్నారు.

గాలి రీ ఎంట్రీ గ్యారెంటీ ?

గాలి రీ ఎంట్రీ గ్యారెంటీ ?

గాలి జనార్దన్ రెడ్డి ఆయన చేసిన రూ. 150 కోట్ల లంచం ఆరోపణలకు పక్కా ఆధారాలు ఇస్తే కర్ణాటకలో జేడీఎస్ ను భారీ దెబ్బ కొట్టవచ్చని బీజేపీ ప్లాన్ వేసింది. అదే జరిగితే గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీ ఎంట్రీ గ్యారెంటీ అంటున్నారు.

సీన్ రివర్స్ అయితే !

సీన్ రివర్స్ అయితే !

గాలి జనార్దన్ రెడ్డి చేసిన ఆరోపణలకు పక్కా సాక్షాలు సమర్పించకుంటే కుమారస్వామి ఎదురుదాడి చేసే అవకాశం ఉందని. తన మీద లేనిపోని ఆరోపణలు చేసిన బీజేపీ నాయకులు కనీసం సాక్షాలు కూడా సమర్పించలేదని బీఎస్.యడ్యూరప్ప, గాలి జనార్దన్ రెడ్డి తదితరుల మీద ఎదురుదాడికి దిగే అవకాశం ఉంది. అలా జరిగితే గాలి జనార్దన్ రెడ్డికి కూడా రాజకీయంగా ఇబ్బందులు ఎదురౌతాయని సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Karnataka former minister Gali Janardhan Reddy appeared before Special Investigation Team in the Janthakal mining company case. Former Chief Minister of Karnataka H D Kumaraswamy was denied anticipatory bail by a special court in the Janthakal mining company case. Kumaraswamy who had been granted interim relief earlier was denied the same this time around.
Please Wait while comments are loading...