మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ వోరా కన్నుమూత: మోడీ, రాహుల్ సంతాపం

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోతీలాల్ వోరా()93) సోమవారం కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఎస్కార్ట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.

కాగా, మోతీలాల్ వోరా ఆదివారమే తన 93 పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. అక్టోబర్ నెలలో కరోనా బారినపడిన ఆయన.. ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలైన తరుణ్ గొగొయ్, అహ్మద్ పటేల్ తర్వాత మోతీలాల్ వోరా నెల రోజుల వ్యవధిలోనే మరణించడంతో ఆ పార్టీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

1927లో జన్మించిన మోతీలాల్ వోరా.. యుక్తవయసు నుంచే చాలా కాలంపాటు జర్నలిజంలో సేవలందించారు. అనంతరం 1968లో రాజకీయాల్లో ప్రవేశించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా, ఆలిండియా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.

Former CM, veteran congress leader Motilal Vora passes away at 93

మోతీలాల్ వోరా మృతి పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. వోరా మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయనను కోల్పోవడం దురదృష్టకరమన్నారు. వోరా కుటుంబానికి రాహుల్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అసలైన కాంగ్రెస్ వాది అని, మంచి మనిషి అని కొనియాడారు.

మోతీలాల్ వోరా మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. వోరా కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. రాజకీయాల్లో దశాబ్దాలపాటు అలుపెరుగని సేవలందించారని కొనియాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+