పానీపురి కోసం వెళ్తే!: బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్..
విజయ్ జోలీ వారి వెంట పడి పట్టుకునేందుకు ప్రయత్నించినా.. ట్రాఫిక్ జామ్ కారణంగా వారు తప్పించుకుపోయారు. దీంతో పోలీసులను ఆశ్రయించిన జోలీ.. దీనిపై కేసు నమోదు చేశారు
న్యూఢిల్లీ: దొంగలకు ఎవరైతే ఏంటి? పని కానిచ్చామా.. లేదా అన్నదే వారి లెక్క. ఈ లెక్కలో అప్పుడప్పుడు ప్రజాప్రతినిధులు కూడా బాధితులుగా మిగిలిపోతుంటారు. తాజాగా బీజేపీ ఓ మాజీ ఎమ్మెల్యే ఒకరు ఇందులో బాధితులుగా చేరిపోయారు. పాపం.. పానీపురి తిందామని వెళ్లిన ఆ ఎమ్మెల్యేకు దొంగలు ఊహించని షాక్ ఇచ్చారు.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విజయ్ జోలీ.. పానీపురి తినడం కోసం రోడ్డు పక్కన కారు ఆపారు. తన స్నేహితుడితో కలిసి లడూసరాయ్ ప్రాంతంలో పానీపరి తింటుండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు దొంగలు.. కారులోని ల్యాప్ టాప్ బ్యాగును ఎత్తుకెళ్లిపోయారు.

విజయ్ జోలీ వారి వెంట పడి పట్టుకునేందుకు ప్రయత్నించినా.. ట్రాఫిక్ జామ్ కారణంగా వారు తప్పించుకుపోయారు. దీంతో పోలీసులను ఆశ్రయించిన జోలీ.. దీనిపై కేసు నమోదు చేశారు. బ్యాగులో ల్యాప్ టాప్ తో పాటు డిజిటల్ కెమెరా, కొన్ని ముఖ్యమైన
డాక్యుమెంట్స్ ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన తానే చోరీకి గురయ్యానంటే.. ఇక సామాన్య జనం సంగతేంటి? అని జోలీ వాపోయారు. ప్రస్తుతం జోలీ ఢిల్లీ బీజేపీలో ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.












Click it and Unblock the Notifications