మావోయిస్టులతో సంబంధాలు - ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు బిగ్ రిలీఫ్..!!
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు బిగ్ రిలీఫ్ దిక్కింది. కొద్దిసేపటి కిందటే బోంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ సంచలన తీర్పును వెలువడించింది. ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. వెంటనే ఆయనను జైలు నుంచి విడుదల చేయాలనీ ఆదేశించింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ ఆయనపై నమోదైన కేసులపై కొద్దిసేపటి కిందటే తన తీర్పును వినిపించింది.
జీవిత కారాగారశిక్షపై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని జీఎన్ సాయిబాబాకు కల్పించింది. సాయిబాబాతో పాటు ఇదే కేసులో అరెస్టయిన వారినీ నిర్దోషులుగా గుర్తించింది బోంబే హైకోర్టు. తనకు జీవిత ఖైదు విధిస్తూ ట్రయల్ కోర్టు 2017లో ఇచ్చిన ఉత్తర్వులను జీఎన్ సాయిబాబా బోంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో సవాల్ చేశారు. ఆయన దాఖలు చేసిన ఈ పిటీషన్‌పై జస్టిస్ రోహిత్ డియో, జస్టిస్ అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ అనుమతించింది.


శారీరక వైకల్యం వల్ల వీల్‌చైర్‌కే పరిమితమైన జీఎన్ సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ కేంద్ర కారాగారంలో శిక్షను అనుభవిస్తోన్నారు. ఈ కేసులో మరో అయిదుమంది దోషుల అప్పీల్‌ను కూడా జస్టిస్ రోహిత్ డియో సారథ్యంలోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణకు అనుమతి ఇచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ అయిదుమందిలో ఒకరు ఈ కేసు విచారణలో ఉండగానే మరణించారు.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను పోలీసులె అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై అసాంఘిక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) కింద కేసులు నమోదు చేశారు. మార్చి 2017వ తేదీన ఆయనను
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ న్యాయస్థానం సాయిబాబాతో పాటు ఈ అయిదుమందినీ దోషులుగా నిర్ధారించింది. యావజ్జీవ కారాగారశిక్షను విధించింది.

జీఎన్ సాయిబాబాతో పాటు ఓ జర్నలిస్ట్, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి కూడా ఉన్నారు. అత్యంత కఠినమైన యూఏపీఏ సహా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం ఆయనను నాగ్‌పూర్ కేంద్ర కారాగారానికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉంటోన్నారు. తనపై విధించిన శిక్షను బోంబే హైకోర్టుకు సవాల్ చేశారాయన. దీన్ని విచారణకు స్వీకరించింది నాగ్‌పూర్ బెంచ్. తాజాగా ఆయనను నిర్దోషిగా గుర్తించింది.












Click it and Unblock the Notifications