వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జడ్జీలు, న్యాయమూర్తుల భార్యలపై అభ్యంతరకర వ్యాఖ్యల వీడియోలు: జస్టిస్ కర్ణన్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

చెన్నై: మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి సీఎస్ కర్ణన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు మహిళా జడ్జీలు, న్యాయమూర్తుల భార్యలపై అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఆరోపణలపై మూడు ఎఫ్ఐఆర్‌లు దాఖలు కావడంతో పోలీసులు బుధవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, పదవీ విరమణ అనంతరం జడ్జీలపై అభ్యంతరకర వీడియో విడుదల చేసిన ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంలో పోలీసుల జాప్యాన్ని నిరసిస్తూ తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్ సభ్యులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల దీనిపై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు.. ఈ కేసు దర్యాప్తులో పురోగతి ఏమిటని పోలీసులను ప్రశ్నించింది.

Former High Court Judge CS Karnan Arrested For Offensive Remarks On Judges Wives

తమిళనాడు డీజీపీ, చెన్నై పోలీస్ కమిషనర్ వ్యక్తిగతంగా నవంబర్ 7న కోర్టు ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం కర్ణన్‌ను అరెస్ట్ చేశారు.

కాగా, జస్టిస్ కర్ణన్ గతంలో మద్రాసు, కోల్‌కతా హైకోర్టులలో న్యాయమూర్తిగా పనిచేశారు. 2017లో జడ్జీగా ఉన్న సమయంలోనే కర్ణన్ ఆరు నెలలపాటు జైలు శిక్షకు గురయ్యారు. జైలు శిక్ష ఎదుర్కొన్న తొలి సిట్టింగ్ జడ్జీ ఈయనే కావడం గమనార్హం.

English summary
A former High Court judge, CS Karnan, was arrested today over offensive comments he allegedly made against woman judges and wives of judges, which were posted on YouTube.The ex-judge was arrested by the Chennai police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X