Ajay Jadeja: రాజు కాబోతున్న టీమిండియా మాజీ క్రికెటర్..!
భారత క్రికెట్లో స్ట్రైలిష్ బ్యాట్స్ మెన్లలో ఒకరు అజయ్ జడేజా. 1992 నుంచి 2000 మధ్య టీమిండియా క్రికెటర్ గా 196 వన్డేలు, 15 టెస్టులు ఆడిన అజయ్ జడేజా గుజరాత్ లోని జామ్ నగర్ రాజవంశీకుల నేపథ్యం నుంచి వచ్చిన వారన్న విషయం కొందరికే తెలుసు. ఇప్పుడు ఆయన తమ కుటుంబీకులు ఏలుతున్న రాజవంశం సింహాసనానికి అధికారికంగా వారసుడిగా మారారు. ఈ మేరకు ఆయన పినతండ్రి ఇవాళ దసరా సందర్బంగా ఓ ప్రకటన చేశారు.
2000 సంవత్సరంలో క్రికెట్ కు గుడ్ బై చెప్పేసిన అజయ్ జడేజా క్రికెట్ సంబంధిత వ్యవహారాల్లో మాత్రం అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నారు. అదే సమయంలో గుజరాత్ లోని ప్రస్తుత జామ్ నగర్, గతంలో నవానగర్ అయిన రాజ్యానికి ఇవాళ వారసుడిగా ఎంపికయ్యారు. ఆయన పినతండ్రి, ప్రస్తుత మహారాజు అయిన శత్రుశల్యసింగ్ జడేజా అజయ్ పేరును ఇవాళ తన సింహాసనానికి వారసుడిగా ప్రకటించారు.

వనవాసం నుంచే పాండవులు సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దసరా పండుగ రోజు తమ రాజ్యానికి వారసుడిగా ఉండేందుకు అజయ్ జడేజా అంగీకరించడం సంతోషంగా ఉందని మహారాజు అయిన శత్రుశల్య సింగ్ ప్రకటించారు. జామ్ నగర్ ప్రజల కోసం పనిచేసే బాధ్యతను అజయ్ జడేజా తీసుకోవడం ఇక్కడి స్థానికులకు వరంగా ఆయన అభివర్ణించారు. శత్రుశల్య సింగ్ కూడా గతంలో క్రికెట్ ఆడారు. ఆయన అజయ్ జడేజా తండ్రి, దిగ్గజ క్రికెటర్ అయిన రంజిత్ సింగ్ జడేజాకు సోదరుడే. ఆయన 1907 నుంచి 1933 వరకూ భారత జాతీయ జట్టు తరఫున ఆడారు.












Click it and Unblock the Notifications