Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్ణాటక మాజీ సీఎం ఎస్ ఎం కృష్ణ కన్నుమూత

SM Krishna: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారు జామున 3:30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.

బెంగళూరులోని నివాసంలో ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతారు. అనంతరం ఆయన స్వగ్రామం- మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకా పరిధిలో గల సోమణహళ్లిలో అంత్యక్రియలను నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనుంది.

Former Karnataka Chief Minister SM Krishna passed away at 92

కొంతకాలంగా శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడ్డారాయన. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. డిశ్చార్జ్ అయిన తరువాత ఇంటివద్దే విశ్రాంతి తీసుకుంటోన్నారు. ఈ తెల్లవారు జామున అనారోగ్యానికి గురయ్యారు. 3:30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.

ఆయన పూర్తి పేరు సోమణహళ్లి మల్లయ్య కృష్ణ. 1932 మే 1వ తేదీన మండ్య జిల్లాలోని సోమణహళ్లిలో జన్మించారు. మైసూరు మహారాజా కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. అమెరికాలోనూ చదువుకున్నారు. 1960లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1962లో మద్దూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 1968 నాటి లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నుంచి పోటీ చేసి గెలిచారు. క్రమంగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. దీన్ని గోల్డెన్ పీరియడ్‌గా అభివర్ణిస్తుంటారు కన్నడిగులు. బెంగళూరు స్వరూపం సమూలంగా మారిందీ కాలంలోనే. సిలికాన్ సిటీగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

బెంగళూరు- ఐటీ హబ్‌గా, సాఫ్ట్‌వేర్ కంపెనీలకు కేంద్రబిందువుగా రూపాంతంరం చెందింది. నగరంలో పలుచోట్ల ఫ్లైఓవర్లు ఆయన హయాంలోనే నిర్మితం అయ్యాయి. రోడ్లు విస్తరణకు నోచుకున్నాయి. ఫలితంగా కనెక్టివిటీ పెరిగింది. సాఫ్ట్‌వేర్ సంస్థలను నెలకొల్పే వారికి ప్రభుత్వాలు అనేక రాయితీలను ఇవ్వడం మొదలైంది ఆయన హయాంలోనే.

2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా, 2009 నుంచి 2012 వరకు విదేశాంగ శాఖ మంత్రిగా పని చేశారు. 2017లో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

ఎస్ఎం కృష్ణ కన్నుమూత పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధితనే మల్లికార్జున్ ఖర్గే, పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+