Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎంను కలిసిన మాజీ సీఎం, హీరో, ఢిల్లీలో డీల్ చెయ్యాలని ప్లాన్, లోకల్ సపోర్ట్ లేదని ?

బెంగళూరు/పణజి: లోక్ సభ ఎన్నికలు 2024లో బీజేపీతో పొత్తు దిశగా మరో అడుగు ముందుకు వేస్తూ జేడీఎస్ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి తన కుమారుడు, సినీ హీరో నిఖిల్ కుమారస్వామితో కలిసి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో (బీజేపీ)తో సమావేశమై చర్చలు జరిపారు. లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఒక నెల తర్వాత జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి తన కుమారుడు నిఖిల్‌తో కలిసి పనాజీలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో చర్చలు కొనసాగించడం హాట్ టాపిక్ అయ్యింది.

పొత్తు కుదిరినప్పటి నుంచి కర్ణాటక బీజేపీ నేతలు కుమారస్వామిని అధికారికంగా కలుసుకోలేదు. పొత్తు అధికారికంగా ప్రకటించకముందే జేడీఎస్ నేతలతో చర్చలు జరపాలని బీజేపీ హైకమాండ్ గోవా సీఎంను ఆదేశించింది. సెప్టెంబర్ 22వ తేదీన ఢిల్లీలో కుమారస్వామి, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మధ్య జరిగిన సమావేశంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా పాల్గొన్నారు.

Former Karnataka CM and JDS leader HD Kumaraswamy held talks with Goa CM Pramod Sawant.

ఢిల్లీలో జరిగిన సమావేశానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఎవరూ హాజరుకాలేదు. జేడీఎస్ తో పొత్తు తర్వాత కర్ణాటక మాజీ సీఎంలు బీఎస్ యడ్యూరప్ప, బసవరాజ్ బొమ్మయ్ వంటి సీనియర్ నేతలు ఎవరూ జేడీఎస్ నాయకుడు, మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామితో సమావేశమై చర్చలు జరపలేదు. ఈ గందరగోళం మధ్య కుమారస్వామి పనాజీలో గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ను కలిశారు.

లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై చర్చించేందుకు మాజీ సీఎం కుమారస్వామి బీజేపీ హైకమాండ్‌తో అపాయింట్‌మెంట్ ఇప్పించాలని గోవా సీఎం సవాంత్ ను కోరినట్లు సమాచారం. బీజేపీ సీనియర్ నేతల సంగతి పక్కన పెడితే జేడీఎస్ తో పొత్తును ప్రకటించే ముందు బీజేపీ హైకమాండ్ తమతో సంప్రదింపులు జరపకపోవడంపై కర్ణాటకలోని బీజేపీకి చెందిన ఓ వర్గం నేతలు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

Former Karnataka CM and JDS leader HD Kumaraswamy held talks with Goa CM Pramod Sawant.

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, అమిత్ షాల మధ్య జరిగిన చర్చ గురించి తనకు తెలియదని ఇప్పటికే కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప అన్నారు. అయితే కుమారస్వామి తనను కలుస్తానని చెప్పినా ఆ సమావేశం ఇంత వరకు జరగలేదు. దసరా పండుగ తర్వాత సీట్ల పంపకాలపై బీజేపీ నేతలతో చర్చిస్తామని జేడీఎస్ నాయకుడు కుమారస్వామి తెలిపారు. కేంద్ర నేతలతో ఆయన సమావేశం కానున్నారు.

పొత్తులపై సొంత పార్టీ నేతలే భగ్గుమంటున్నందున సీట్ల పంపకాల విషయాన్ని వీలైనంత త్వరగా అధికారికంగా ప్రకటించాలని మాజీ సీఎం కుమారస్వామి భావిస్తున్నారు. జేడీఎస్‌కు చెందిన కొందరు నేతలు ఇప్పటికే ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని పదేపదే మీడియా ముందు చెప్పడంతో జేడీఎస్ పార్టీ నుంచి తొలగించిన ఆ పార్టీ కర్ణాటక రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

Former Karnataka CM and JDS leader HD Kumaraswamy held talks with Goa CM Pramod Sawant.

ఇప్పుడు సీఎం ఇబ్రహీం జేడీఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ కనీసం ఆరు సీట్లు అడిగిందని, అయితే ప్రాంతీయ పార్టీకి నాలుగు సీట్లకు మించి వదులుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదని బీజేపీకి చెందిన కొందరు నాయకులు చెబుతున్నారని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+