నేను న్యాయం చేస్తే నాకు అన్యాయం చేశారు, మాజీ సీఎం యడియూరప్ప, హోం మంత్రి క్లారిటీ ఇదే !

తనపై నమోదైన పోక్సో కేసుపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప స్పందించారు. నేను వాళ్లకు మంచి చెయ్యాలని అనుకున్నానని, వాళ్లు తన మీద తప్పుడు కేసు పెట్టారని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప విచారం వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చెయ్యలేదని, తాను నిర్దోషిగా బయటకు వస్తానని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప అన్నారు.

బెంగళూరులో శుక్రవారం మీడియాతో మాట్లాడిన బీఎస్ యడియూరప్ప ఓ మహిళ ఆమె కూతురితో కలిసి తనకు న్యాయం చెయ్యాలంటూ తన దగ్గరకు వచ్చిందని, ఆ తల్లీ, కూతురు చాలాసార్లు తన ఇంటికి వచ్చి వెళ్లారని, వాళ్లను మా ఇంట్లోకి పిలిచి మీ సమస్య ఏమిటని అడిగానని బీఎస్ యడియూరప్ప అన్నారు. నేను వాళ్లకు న్యాయం చేస్తే ఇప్పుడు వాళ్లు నాకు అన్యాయం చెయ్యడానికి తన మీద తప్పుడు కేసు పెట్టి తన గురించి ఇలా మాట్లాడటం మొదలుపెట్టారని మాజీ సీఎం యడియూరప్ప ఆరోపించారు.

Former Karnataka CM BS Yeddyurappa accused of registering a false case against him

నేను బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పి తల్లీ కూతురిని అక్కడికి పంపించారని, తరువాత ఆ అమ్మాయి తన మీద ఇలాంటి కేసు పెట్డిందని బీఎస్ యడియూరప్ప ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా ఏదో చేస్తున్నారని, మహిళలు నాపై ఫిర్యాదు చేశారని, ఆ ఆరోపణలు నిరాధారం అని, వాటిని తాను లాగైనా ఎదుర్కొంటామని, ఇది రాజకీయ ప్రేరేపితమని, రాజకీయ కక్ష అని చెప్పడం నాకు ఇష్టం లేదని మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప అన్నారు.

బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు మార్చి 14వ తేదీ గురువారం అర్థరాత్రి 81 ఏళ్ల వయసు ఉన్న మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఈ కేసు గురించి కర్ణాటక హోం మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం యడ్యూరప్ప సీనియర్ రాజకీయ నాయకుడు అని, ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని ఆయన అన్నారు.

గురువారం రాత్రి ఓ మహిళ మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప మీద ఫిర్యాదు చేసిందని, దీనిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారని, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని, విచారణ పూర్తయ్యే వరకు పూర్తి సమాచారం బయటకు చెప్పలేమని, ఇది మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన కేసు కావడం, చాలా సున్నితమైన అంశం కావడంతో ఆచితూచి మాట్లాడం మంచిదని కర్ణాటక హోం మంత్ిర డాక్టర్ పరమేశ్వర్ అన్నారు

Former Karnataka CM BS Yeddyurappa accused of registering a false case against him

మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కావాలంటే మేం కల్పిస్తామని హోం మంత్రి పరమేశ్వర్ అన్నారు. మాజీ సీఎం యడ్యూరప్పపై ఫిర్యాదు చేసిన మహిళ మానసిక వ్యాధితో బాదపడుతోందని కొందరు చెబుతున్నారని, ఆమె ఫిర్యాదు లిఖితపూర్వకంగా ఇవ్వలేదని, టైపు చేసి ఫిర్యాదు ఇచ్చిందని, ఇది మాజీ సీఎంకు సంబంధించిన విషయం కావడంతో కాస్త జాగ్రత్తగా మాట్లాడాలని కర్ణాటక హోం మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+