బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Amit Shah: అమిత్ షా భారత్ రెండో సర్దార్ వల్లభాయ్ పటేల్, మీరు ఏం పీకేశారని ?, ఫైర్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/శివమొగ్గ: బీజేపీ, కేజేపీ విడిపోయి ఉండకపోతే ఈ జన్మలో సిద్ధరామయ్య సీఎం అయ్యేవాడు కాదని కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సిద్ధరామయ్యపై విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి బసవ ప్రభు స్వామి కర్ణాటకకు కాబోయే సీఎం అంటూ సిద్ధరామయ్య శనివారం మీడియాకు చెప్పారు. సిద్దరామయ్య వ్యాఖ్యలతో మాజీ మంత్రి ఈశ్వరప్ప ఇలా స్పందించారు. బీజేపీ, కేజేపీ విడిపోకుంటే సిద్ధరామయ్య జన్మలో సీఎం అయ్యేవాడుకాదని అన్నారు.

సిద్దరామయ్య నాయకత్వంలో కర్ణాటకలో అభివృద్ధి జరిగిందం అని అందరూ చూస్తున్నారని ఈశ్వరప్ప ఎద్దేవ చేశారు. మేము ఐక్యంగా ఉన్నాము. నేడు బీజేపీ సంస్థాగతంగా ఎంతో ఎదిగింది. మోడీ నాయకత్వంతో పాటు అభివృద్ధి పనులు జరిగాయని ఈశ్వరప్ప చెప్పారు. కర్ణాటకలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని, మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం తనకు ఉందని ఈశ్వరప్ప చెప్పారు.

 Former Karnataka minister KS Eshwarappa says Union Minister Amit Shah is Indias second Sardar Vallabhbhai Patel

Wife: పెళ్లైన మూడు రోజులకే బెడ్ రూమ్ లో భార్య తల్లితో రొమాన్స్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న టిక్ టాక్ స్టార్Wife: పెళ్లైన మూడు రోజులకే బెడ్ రూమ్ లో భార్య తల్లితో రొమాన్స్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న టిక్ టాక్ స్టార్

సిద్ధరామయ్య కాబోయే సీఎం అని ఎవరైనా స్వామీజీ చెబితే అది నిజంకాదని, రాష్ట్ర ప్రజలే సీఎం ఎవరు అని నిర్ణయించాలని, ప్ర‌జ‌లు బీజేపీకి అనుకూలంగా ఉంటున్నార‌నే విశ్వాసం తనకు ఉంద‌ని ఈశ్వరప్ప ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మీద ఇటీవల కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చేసిన ప్రకటనపై ఈశ్వరప్ప మాట్లాడారు.

రాహుల్ గాంధీ భారత జూడో యాత్ర చేస్తే కాంగ్రెస్ అధికారంలో వస్తుందా అని ఈశ్వరప్ప ప్రశ్నించారు. అమిత్ షా భారతదేశం రెండో సర్దార్ వల్లభాయ్ పటేల్. అమిత్ షా హోంమంత్రి అయిన తర్వాత తీవ్రవాదాన్ని నియంత్రించారని చెప్పిన మాజీ మంత్రి ఈశ్వరప్ప కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు చురకలు అంటిచారు.

Bride: కొత్త పెళ్లికూతురు జంప్, రెండు వారాల్లో ఇద్దరితో పెళ్లి, మూడు నెలల గర్బతి, ట్వీస్ట్ లే ట్విస్ట్ లు !Bride: కొత్త పెళ్లికూతురు జంప్, రెండు వారాల్లో ఇద్దరితో పెళ్లి, మూడు నెలల గర్బతి, ట్వీస్ట్ లే ట్విస్ట్ లు !

ఇంతకాలానికి రాహుల్ గాంధీకి దేశాన్ని చూసే అవకాశం వచ్చింది. అందుకు నేను సంతోషిస్తున్నాను. అమిత్ షా ఢిల్లీలో కూర్చున్నారు అంతా గమనిస్తున్నారు. ఉగ్రవాదంపై పోరుకు అమిత్ షా ఎన్ని చర్యలు తీసుకున్నారు? సిద్ధరామయ్య అలాంటి పరిస్థితుల్లో ఎందుకు పని చేయలేదు...? డీకే శివకుమార్ ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నారు? అని ఈశ్వరప్ప ప్రశ్నించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తున్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉగ్రవాదులకు కాంగ్రెస్‌ మద్దతుగా నిలుస్తోందన్నారు. అమిత్ షా చేస్తున్న పనికి మద్దతివ్వండం లేదని, మీరు దేశభక్తులు ఎలా అవుతారు అని ఈశ్వరప్ప ప్రశ్నించారు. పనిలోపనిగా అమిత్ షాను ఆకాశానికి ఎత్తేసిన మాజీ మంత్రి ఈశ్వరప్ప కాంగ్రెస్ నాయకుల మీద విరుచుకుపడ్డారు.

English summary
Former Karnataka minister KS Eshwarappa says Union Minister Amit Shah is India's second Sardar Vallabhbhai Patel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X