మాజీ డీసీఎం పనికిమాలిన, విలువలేని లీడర్, సొంత పార్టీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్, సీఎంతో ?
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర బీజేపీ శాఖలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కర్ణాటక మాజీ డీసీఎం కేఎస్ ఈశ్వరప్పపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఎస్ టీ సోమశేఖర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే కేఎస్ ఈశ్వరప్పకు విలువ, మర్యాద రెండు లేవని, అలాంటి విలువ లేని వ్యక్తులు మాట్లాడుతున్న మాటలను తాను పట్టించుకోనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేను బీజేపీని విడిచిపెట్టి వెళ్లాలని చెప్పడానికి కేఎస్. ఈశ్వరప్ప ఎవరు? అని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే సోమశేఖర్ ప్రశ్నించారు. కర్ణాటకకు కాబోయే బీజేపీ శాఖ అధ్యక్షుడు కేఎస్ ఈశ్వరప్ప? అని ప్రచారం జరుగుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ చేస్తున్న వ్యాఖ్యలతో బీజేపీలోని కొందరు పెద్దలు హడలిపోయారు. ఈశ్వరప్పను నమ్మి పార్టీలో చేరలేదని, బీఎస్ యడ్యూరప్పను నమ్ముకుని పార్టీలోకి వచ్చానని సోమశేఖర్ అన్నారు.

ఇన్ని పరిణామాల తర్వాత యడ్యూరప్పతో మాట్లాడాను. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడకూడదని ఆయన తనకు చెప్పారని, ఆయన మాటలకు విలువ ఇచ్చి తాను బీజేపీలోనే ఉన్నానని, ఇప్పుడు తన గురించి కొందరు వ్యక్తులు మాట్లాడుతున్నా వారిని పట్టించుకోవడం లేదని పరోక్షంగా, ప్రత్యక్షంగా మాజీ డీసీఎం కేఎస్ ఈశ్వరప్పపై బీజేపీ ఎమ్మెల్యే ఎస్ టీ సోమశేఖర్ మండిపడ్డారు.
సోమశేఖర్ మద్దతుదారులు ఇటీవల బీజేపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి ఆర్ అశోక్ నియోజకవర్గంలో చాలా మంది బీజేపీని వదిలేశారని, ఆర్ఆర్ నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న నియోజక వర్గంలో బీజేపీ కార్యకర్తలు, కేఆర్ పురం నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారని, కేవలం తన నియోజక వర్గం బీజేపీ నాయకులు మాత్రమే బీజేపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఎస్ టీ సోమశేఖర్ అన్నారు.
తనను టార్గెట్ చేసుకుని మాజీ డీసీఎం కేఎస్ ఈశ్వరప్పతో పాటు కొందరు మాట్లాడుతున్నారని, అలాంటి వ్యక్తుల గురించి తాను పెద్దగా పట్టించుకోనని సోమశేఖర్ అన్నారు. తన నియోజక వర్గంలోని ప్రజల ప్రయోజనాల కోసం తాను కర్ణాటక సీఎం సిద్దరామయ్యను, డీసీఎం డీకే శివకుమార్ ను కలిశానని, ఇక ముందు కూడా కలుస్తానని, అందులో తప్పు ఏముందో చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ మాజీ డీసీఎం కేఎస్. ఈశ్వరప్పను ప్రశ్నించారు. మొత్తం మీద కర్ణాటకలోని బీజేపీ నాయకుల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటకు వచ్చాయి.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications