వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ అధికారులతో భేటీ నిజమే, బాంబు పేల్చిన మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ కు కష్టాలు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో తాను పాకిస్థాన్ హై కమిషనర్‌తో సమావేశం అయిన మాట నిజమే అంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ధ్రువీకరించారు. మణిశంకర్ అయ్యర్ ఇంటిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాను పాల్గొన్నానని మన్మోహన్ సింగ్ బాంబు పేల్చారు.

పాక్ తో గుజరాత్ ఎన్నికల చర్చ !

పాక్ తో గుజరాత్ ఎన్నికల చర్చ !

తాను గుజరాత్ శాసన సభ ఎన్నికల గురించి పాకిస్థాన్ అధికారులతో మాట్లాడలేదని మన్మోహన్ సింగ్ చెప్పారు. తాను మాత్రమే కాకుండా ఇతరులు కూడా గుజరాత్ శాసన సభ ఎన్నికల గురించి పాకిస్థాన్ అధికారులతో చర్చించలేదని మన్మోహన్ సింగ్ వివరించారు.

ప్రధాని మోడీపై ఫైర్

ప్రధాని మోడీపై ఫైర్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇదే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమని, మోడీ వ్యాఖ్యలతో తన మనసు చాల గాయపడిందని మన్మోహన్ సింగ్ అన్నారు.

మోడీ క్షమాపణ చెప్పాలి

మోడీ క్షమాపణ చెప్పాలి

తాను గత ఐదు దశాబ్దాలుగా దేశం కోసం చేస్తున్న కృషి అందరికీ తెలిసిందేనని, కొత్తగా చెప్పనవసరం లేదని మన్మోహన్ సింగ్ అన్నారు. తాను పాకిస్థాన్ హైకమిషన్ అధికారులతో రహస్యంగా సమావేశమైనట్లు దుష్ప్రచారం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే తనకు క్షమాపణ చెప్పాలని మన్మోహన్ సింగ్ డిమాండ్ చేశారు.

ఇరకాటంలో కాంగ్రెస్

ఇరకాటంలో కాంగ్రెస్

మణిశంకర్ అయ్యర్ ఇంటిలో పాకిస్థాన్ అధికారులతో సమావేశం జరిగినట్లు ఆరోపణలు వచ్చినప్పుడు మొదట కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది, అయితే సోమవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా అంగీకరించడంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాలటంలో పడింది.

గుజరాత్ ఎన్నికల చర్చ !

గుజరాత్ ఎన్నికల చర్చ !

పాక్ అధికారులతో గుజరాత్ శాసన సభ ఎన్నికల విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని, ఆ విషయంలో తాను ఎవరితోనూ మాట్లాడలేదని, ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపణలను ఖండిస్తున్నానని మన్మోహన్ సింగ్ చెప్పారు.

కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు

కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు

పాకిస్థాన్ హై కమిషన్ అధికారులతో సమావేశమైనట్లు మన్మోహన్ సింగ్ స్వయంగా అంగీకరించడంతో కాంగ్రెస్‌ పార్టీ ఇరకాటంలో పడింది. ఈ సమావేశం వివరాలను రహస్యంగా ఎందుకు ఉంచారని, విదేశాంగ శాఖకు ఎందుకు తెలియజేయలేదని బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీని బహిరంగంగా నిలదీస్తున్నారు.

English summary
Former Prime Minister Manmohan Singh on Monday lashed out at PM Narendra Modi for allegedly spreading "falsehood and canards" to "score political points in a lost cause.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X