ప్రధాని మోడీతో మాజీ ప్రధాని దేవేగౌడ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అహ్వానం మేరకు మాజీ ప్రధాని హెచ్ డి దేవేగౌడ న్యూఢిల్లీ చేరుకుని పలు విషయాలపై చర్చించారు. బుధవారం సాయంత్రం దళపతి దేవేగౌడ న్యూఢిల్లీలోని రేస్ కోర్స్ రోడ్డులోని నరేంద్ర మోడీ నివాసం చేరుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూసేకరణ చట్టం వలన రైతులు కష్టాలు పడే అవకాశం ఉందని, ఆ దిశగా మీరు ఆలోచించాలని ఇదే సందర్బంలో మాజీ ప్రధాని దేవేగౌడ ప్రధాని మోడీ దృష్టికి తీసుకు వెళ్లారని తెలిసింది.

అదేవిధంగా కర్ణాటకలో నైస్ సంస్థ భూములు స్వాదీనం చేసుకోవడం వలన రైతులు అనేక కష్టాలు పడుతున్నారని, ఆ సంస్థ మాత్రం వ్యాపారం చేసుకుంటున్నదని చెప్పారని తెలిసింది. అనంతరం దేవేగౌడ విలేకరులతో మాట్లాడారు.
భూసేకరణ చట్టం వలన రైతులకు ఎలాంటి కష్టాలు రావని ప్రధాని మోడీ హామి ఇచ్చారని చెప్పారు. రైతులను అన్ని విదాలు ఆదుకుంటామని, మమ్మల్ని నమ్మాలని మోడీ చెప్పారని దేవేగౌడ వివరించారు. అయితే భూ సేకరణ చట్టానికి జేడీఎస్ ఇప్పటి వరకు మద్దతు ఇవ్వలేదు. త్వరలోనే దేవేగౌడ ఈ విషయంపై తగిన నిర్ణయం తీసుకుంటారని జేడీఎస్ వర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications