మాజీ ప్రధాని పుట్టినరోజు వేడుకలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు షాక్, దూరంగా ఉండాలని!
మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ పుట్టిన రోజు కావడంతో దేవెగౌడ మౌనం వీడారు. తన పుట్టినరోజు వేడుకల గురించి దేవేగౌడ అభిమానుకు ఓ మనవి చేశారు. ఈ నెల 18వ తేదీ నాటికి తనకు 91 ఏళ్లు నిండి 92వ ఏటలో అడుగుపెడుతున్నానని, కొన్ని కారణాల వల్ల పుట్టినరోజు జరుపుకోవడం లేదని, అందుకు మీరందరూ పెద్ద మనసుతో తన కోరికను అంగీకరించాలని దేవేగౌడ ఓ లేఖ విడుదల చేశారు.
జేడీఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోకూడదని మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ అభిమానులకు మనవి చేవారు. ప్రస్తుతం జరుగుతున్న విధాన పరిషత్ ఎన్నికలలో జేడీఎస్-బీజేపీ కూటమి అభ్యర్థుల గెలుపుకోసం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పని చెయ్యాలని, ఎన్ డీఏ అభ్యర్థుల గెలుపుకోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ పార్టీ కోసం నిబద్ధతతో పని చేయాలని మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ ఆయన అభిమానులకు మనవి చేశారు.

మే 18వ తేదీన శనివారం 92వ ఏట అడుగుపెడుతున్న మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ఈసారి తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోకూడదని నిర్ణయించుకున్నారు. జేడీఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఎవరూ బెంగళూరులోని తమ నివాసానికి రావద్దని, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడానికి ప్రయత్నించకూడదని మాజీ ప్రధాని దేవేగౌడ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మనవి చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో బాధపడ్డ దేవేగౌడ ఈసారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు జేడీఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
అయితే మండ్య, హాసన్, పాత మైసూరు ప్రాంతాల్లోని పలు చోట్ల మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ పుట్టినరోజు సందర్బంలో అన్నదానాలు చేశారు. పలు చోట్ల అనాథ ఆశ్రమాల్లో అన్నదానం చేసి పిల్లలకు దుస్తులు పంచిపెట్టారు. దేవేగౌడ పుట్టిన రోజు సందర్బంగా ఆయన నివాసం దగ్గరకు జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు వెళ్లకూడదని ముందే సూచించడంతో బెంగళూరు నగరంలోని ఆయన నివాసం దగ్గరికి ఎవ్వరూ వెళ్లలేదు. కొందరు ముఖ్యమైన నాయకులు మాత్రమే దేవేగౌడను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారని సమాచారం.












Click it and Unblock the Notifications