Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోదీకి మాజీ ప్రధాని అండ, నమో విద్యానిధి స్కాలర్ షిప్ లు, సోనియా గాంధీకి చెక్ !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో అధికారంలో ఉన్న సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోవడంతో బీజేపీ నాయకులు అయోమయంలో పడిపోయారు. గుజరాత్ ప్రయోగాలు చెయ్యాలని ప్రయత్నించిన బీజేపీ హైకమాండ్ కన్నడిగుల దెబ్బకు, బీజేపీ రెబల్స్ దెబ్బకు ఆ పార్టీ నాయకులకు దిమ్మతిరిగిపోయింది. ఇప్పుడు కర్ణాటకలో మరో బలమైన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని సమాచారం.

బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య నమో విద్యానిధి పథకం కార్యక్రమం కింద 10 మంది విద్యార్థులకు రూ.10,000 వేలు చొప్పున స్కాలర్‌షిప్‌లను మాజీ ప్రధాని హెచ్‌డీ. దేవెగౌడ పంపిణీ చేశారు. బెంగళూరు నగరంలోని పద్మనాభనగర్‌లోని మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి వెళ్లిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆయనతో భేటీ అయ్యారు.

 hddevegowda
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ, సీఎం, డీకేకి సమన్లు ఇచ్చిన ప్రత్యేక కోర్టు, ఆ రోజుల్లో!

నమో విద్యానిధి కార్యక్రమం కింద, బలహీన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున స్కాలర్‌షిప్‌లు అందించడం ఈ పథకం లక్ష్యం. విద్యార్థులకు నేరుగా డబ్బు చెల్లించబడుతుంది. ప్రస్తుతం నమో విద్యానిధి పథకం కింద వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ పొందారు.

మాజీ ప్రధాని హెచ్ డీ. దేవెగౌడ వంటి ప్రముఖుడి నుంచి చెక్కులు అందుకోవడం ఎంతో మంది నిరుపేద విద్యార్థులు చిరస్మరణీయమైన అనుభవం పొందారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అన్నారు. ఈ పేద విద్యార్థుల చెక్కులు ఇచ్చేందుకు అంగీకరించినందుకు మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడకు కృతజ్ఞతలు అని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చెప్పారు. స్కాలర్ షిప్ లు అందుకున్న విద్యార్థులు బాగా చదువుకోవాలని, దేశ భవిష్యత్తు కోసం అందరూ భాగస్వాములు కావాలని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సూచించారు.

 hddevegowda

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ 135 అసెంబ్లీ నియోజక వర్గాల్లో విజయం సాధించింది. 135 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ దర్జాగా కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ దెబ్బతో బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఊహించని విధంగా నష్టపోయాయి. ఇప్పుడు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పొత్తు పెట్టుకుంటాయని కర్ణాటకలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఊహాగానాలకు దీటుగా కర్ణాటకలో పట్టు కోల్పోయిన బీజేపీ లోక్ సభ ఎన్నికలపై ధీమాగా ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో కర్ణాటకలో సత్తా చాటాలని అనుకున్న జేడీఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఢీలా పడిపోయింది. కేవలం 19 స్థానాలకే పరిమితమైన జేడీఎస్‌కి ఇప్పుడు మరో రాజకీయ పార్టీ మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చెయ్యాలని జేడీఎస్, బీజేపీ పొత్తు విషయంపై చర్చలు సాగిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది.

 soniarahulgandhi

మాజీ ప్రధాని హెచ్ డీ. దేవెగౌడ, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య స్నేహం బాగానే ఉన్న సంగతి తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నప్పుడు మాజీ ప్రధాని దేవెగౌడ గురించి కానీ, జేడీఎస్ పార్టీ గురించి కానీ పెద్దగా ఎక్కడా మాట్లాడలేదు. మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీల మీద ఎక్కువగా విమర్శలు చెయ్యలేదు. దీని తర్వాత పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ప్రధాన ప్రతిపక్షాలు గైర్హాజరైనప్పటికీ మాజీ ప్రధాని హెచ్ డీ. దేవెగౌడ ఆ కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుని జేడీఎస్ పార్టీ పోటీ చేస్తుందనే ప్రచారం పై జేడీఎస్ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొట్టిపారేశారు. మాతో ఎవరూ పొత్తు విషయం గురించి మాట్లాడలేదని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. మరి రానున్న రోజుల్లో కర్ణాటక రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో వేచి చూడాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+