పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ, సీఎం, డీకేకి సమన్లు ఇచ్చిన ప్రత్యేక కోర్టు, ఆ రోజుల్లో!

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించాలని బీజేపీ నాయకులు డిసైడ్ అయ్యారు. కర్ణాటకలో గతంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్ ప్రభుత్వం అంటూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం చేసింది. పదేపదే బీజేపీ 40 శాతం కమీషన్ ప్రభుత్వం అంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్దిపొంది చివరికి కర్ణాటకలో అధికారం దక్కించుకుంది.

భారతీయ జనతా పార్టీ నాయకులు వేసిన పరువు నష్టం దావా కేసుకు సంబంధించి కర్ణాటకలోని ప్రత్యేక కోర్టు బుధవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, యువరాజు రాహుల్ గాంధీకి సమన్లు ​​జారీ చేసింది. పరువు నష్టం కేసులో దోషిగా తేలి ఎంపీ పదవిపై అనర్హత వేటు పడిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై కర్ణాటకలో మరో పరువునష్టం కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

rahul gandhi siddaramaiah dk shiva kumar

రాహుల్ గాంధీ, సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ సమన్లు ​​జారీ చేశారు. ఈ కేసు జూలై 27న విచారణకు రానుంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు 40% అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ మీద కర్ణాటక రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేశవ్ ప్రసాద్ మే 9న దాఖలు చేసిన ఫిర్యాదులో ఈ ముగ్గురు నాయకుల మీద పరువు నష్టం దావావ వేశారు.

2023 మే 5న వార్తాపత్రికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రకటనలు ఇచ్చింది. అప్పటి బీజేపీ ప్రభుత్వం 40 శాతం అవినీతికి పాల్పడిందని, గత నాలుగేళ్లలో రూ. 1. 5 లక్షల కోట్లు లూటీ చేసిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఏకంగా పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలు ఇచ్చిందని, ఈ ఆరోపణలు నిరాధారమైనవి, మాకుపరువు నష్టం కలిగించేలా కాంగ్రెస్ పార్టీ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిందని బీజేపీ కోర్టును ఆశ్రయించింది.

కర్ణాటకలో గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికి కాంగ్రెస్ పార్టీ చేసిన ఇటువంటి ప్రచారాలు కారణం అని బీజేపీ గుర్తించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్బంగా 2019 నుండి 2023 మధ్య కాలంలో కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం భారీ స్థాయిలో అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ కరప్షన్ రేట్ కార్డ్ ని విడుదల చేసి ఆ కార్డు వివరాలు ప్రజల్లోకి బలంగా వెళ్లేలా కాంగ్రెస్ పార్టీ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది.

అప్పట్లో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో ₹1.50 లక్షల కోట్లు దోచుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. ముఖ్యమంత్రి పదవికి రూ. 2,500 కోట్లు, మంత్రుల పదవికి 500 కోట్లు బీజేపీ హైకమాండ్ కు బీజేపీ నాయకులు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ తన కరప్షన్ రేట్ కార్డ్ లో పేర్కొంది. కర్ణాటకలోని కాంగ్రెస్ ఆరోపణలకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సమర్పించాలని కోరుతూ ఎన్నికల సంఘం ఆ పార్టీకి నోటీసులు జారీ చేసింది.

rahul gandhi siddaramaiah dk shiva kumar

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ నైరాశ్యంతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని, ప్రజలు వారిని తిరస్కరించారు, ఇప్పుడు బీజేపీ నాయకులు నిరాశలో ఉన్నారు, సంబంధం లేనందున కేసు పెట్టాలనుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సలీం అహ్మద్ ఆరోపించారు.

కర్ణాటక ప్రభుత్వంలోని బీజేపీ పెద్దలు 40 శాతం కమీషన్ ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ విచారణకు ఆదేశించలేదు, మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ అవినీతి నాయకుల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకే అవినీతి రేటు కార్డును ప్రజలకు విడుదల చేయాల్సి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లోని అధికారులు 40% లంచం డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణల తర్వాతే మేము బీజేపీ 40% కమీషన్ ప్రభుత్వం అని ప్రచారం చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద అవినీతి ఆరోపణల ప్రచారం భారీగానే చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలు, ఆ పార్టీ మంత్రులపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలోనే విమర్శలు చేసింది. అవినీతి ఆరోపణలు వచ్చినా అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ని బీజేపీ ప్రకటించింది. బీజేపీ నేతలు చేసిన పనికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+