బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడకు కరోనా పాజిటివ్: ఇది రెండోసారి, నిలకడగా ఆరోగ్యం

|
Google Oneindia TeluguNews

దేవెగౌడ జనవరి 21న కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో చేరినట్లు మణిపాల్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 'హెచ్‌డి దేవెగౌడ జనవరి 21న అడ్మిట్ అయ్యారు, అప్పటి నుంచి వైద్యపరంగా నిలకడగా ఉన్నారు. ఆయన కీలక పారామితులు సాధారణ పరిమితుల్లోనే ఉన్నాయి, అతను చికిత్సకు ప్రతిస్పందించారు. ఆయన సౌకర్యవంతంగా, తన గది నుంచి తన కార్యకలాపాలకు హాజరవుతున్నారు. ఆయనను నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నాం' అని మణిపాల్ ఆస్పత్రి వర్గాల పేర్కొన్నాయి.

మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ శనివారం కరోనా వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం కర్ణాటక రాజధాని బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా, దేవెగౌడ్ కరోనా బారినపడటం ఇది రెండోసారి. గత ఏడాది మార్చిలో దేవెగౌడ, ఆయన సతీమణి కరోనా బారినపడ్డారు.

Former Prime Minister HD Devegowda Tests Covid Positive second time, health Stable

దేవెగౌడ జనవరి 21న కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో చేరినట్లు మణిపాల్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 'హెచ్‌డి దేవెగౌడ జనవరి 21న అడ్మిట్ అయ్యారు, అప్పటి నుంచి వైద్యపరంగా నిలకడగా ఉన్నారు. ఆయన కీలక పారామితులు సాధారణ పరిమితుల్లోనే ఉన్నాయి, అతను చికిత్సకు ప్రతిస్పందించారు. ఆయన సౌకర్యవంతంగా, తన గది నుంచి తన కార్యకలాపాలకు హాజరవుతున్నారు. ఆయనను నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నాం' అని మణిపాల్ ఆస్పత్రి వర్గాల పేర్కొన్నాయి.

దేవెగౌడ త్వరగా కోలుకోవాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ కోలుకోవాలని ప్రార్థిస్తూ కర్ణాటక ఆరోగ్యమంత్రి డాక్టర్ కే సుధాకర్ ట్వీట్ చేశారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు తెలిపారు. కరోనా బారిన సీనియర్ నేత, మాజీ ప్రధాని దేవెగౌడ త్వరగా కోలుకోవాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ఆకాంక్షించారు.

కాగా, హెచ్‌డీ దేవెగౌడ జూన్ 1996 నుంచి ఏప్రిల్ 1997 వరకు భారతదేశ 12వ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన గతంలో 1994 నుంచి 1996 వరకు కర్ణాటక 14వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు.

మరోవైపు దేశంలోనూ కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,37,704 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10,050 కి చేరింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 21,13,365 గా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో రికవరీ రేటు 93.31 గా నమోదైంది. రోజు వారీ పాజిటివిటీ రేటు 17.22గా రికార్డయింది.

మరోవైపు, గత 24 గంటల్లో 2,42,676 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. దేశ వ్యాప్తంగా 61.16 కోట్ల మంది వ్యాక్సిన్ పంపిణీ చేసారు. అత్యధికంగా మహారాష్ట్రంలో 48,720, కర్ణాటక రాష్ట్రంలో 48,049, కేరళలో 41,668 కరోనా కేసులు వెలుగుచూశాయి. తమిళనాడులో 29,870, గుజరాత్‌లో 21,225 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా రిజిస్టర్ అయిన కేసుల్లో 56 శాతం కేసులు ఈ అయిదు రాష్ట్రాల్లోనే రికార్డు అయ్యాయి. మహారాష్ట్రలో 14.29 శాతం కేసులు రిజిస్టర్ అయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 488 మరణాలు నమోదయ్యాయి.

English summary
Former Prime Minister HD Devegowda Tests Covid Positive second time, health Stable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X