మోదీ, అమిత్ షా మరో స్కెచ్, ట్రబుల్ షూటర్ కు నిజంగానే ట్రబుల్, అల్లుడుగారు ఎంట్రీతో షాక్ !
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల నాయకుల ఎత్తులు పైఎత్తుల సన్నివేశాలు చాలా క్యూరియాసిటీని సృష్టిస్తుంది. ఈసారి కర్ణాటకలోని పాత మైసూర్‌లో తమ సత్తా చాటేందుకు జేడీఎస్ నేతలు సిద్ధం అయ్యారు. ఈ సమయంలో డీకే సోదరులను కట్టడి చేసేందుకు మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్ డీ దేవెగౌడ అల్లుడిని లోక్‌సభ ఎన్నికల రంగంలోకి దింపేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వ్యూహరచన చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
ప్రస్తుత సమాచారం ప్రకారం బెంగళూరు రూరల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ అల్లుడు, జయదేవ హాస్పిటల్ మాజీ డైరెక్టర్ డాక్టర్ మంజునాథ్ రంగంలోకి దిగుతారని అంటున్నారు. జేడీఎస్ అగ్రనేత, కర్ణాటకమాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఈ విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. అంతేకాదు బీజేపీ హైకమాండ్ నేతలు ఈ సలహా ఇచ్చి మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామిని ఒప్పించారని జేడీఎస్ నాయకులు అంటున్నారు.

ఇదిలా ఉంటే బెంగళూరు గ్రామీణ జిల్లా లోక్ సభ నియోజక వర్గం వ్యూహాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా కుమారస్వామికి చెప్పారనే ప్రచారం కూడా జరుగుతోంది. బెంగళూరు రూరల్ లో డీకే బ్రదర్స్ పెద్ద పట్టు సంపాదించుకున్నారు. వీటిలో కనకపురతోపాటు రామనగర జిల్లాలో డీకే బ్రదర్స్ కు పెద్ద పేరు ఉంది. అయితే ఈసారి బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా డీసీఎం డీకే శివకుమార్ సొంత సోదరుడు, ఆ నియోజక వర్గం సిట్టింగ్ ఎంపీ డీకే. సురేష్ 4వ సారి బరిలోకి దిగుతారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
అలాంటి పరిస్థితిలో మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ అల్లుడు, జయదేవ హాస్పిటల్ మాజీ డైరెక్టర్ డాక్టర్ మంజునాథ్ ను బెంగళూరు రూరల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీకి దింపాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని ద్వారా డీకే సురేష్ ను ఓడించేందుకు వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. మరోవైపు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆయన సోదరుడు డీకే సురేష్ కోసం ఆయన సొంత నియోజకవర్గం మారనున్నారానే చర్చ మొదలైంది.
ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం డీకే సురేష్ బెంగళూరు గ్రామీణ లోక్ సభ నియోజక వర్గం పక్కన పెట్టి బెంగళూరు నార్త్ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికలు కర్ణాటకలో సర్వత్రా ఆసక్తిని రేకెత్తించాయి. సాధారణంగా 2024 లోక్‌సభ ఎన్నికలు ఉత్సుకతను రేకెత్తించాయి. గెలుపు, ఓటముల లెక్కలు కూడా చాలా బలంగా ఉన్నాయి.
ఇప్పుడు కూడా బెంగళూరు రూరల్ లోక్‌సభ నియోజకవర్గంపై కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బెంగళూరు గ్రామీణ జిల్లా లోక్ సభ నియోజక వర్గం నుంచి ఎవరు గెలుస్తారు? ఇక్కడ ఎవరు ఓడిపోతారు?, డీకే సురేష్ అక్కడి నుంచి పోటీ చేస్తారా ?, అధికారం ఎవరికి వస్తుంది? మరి వేచి చూడాల్సిందే.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications