పంజాబ్ మాజీ సీఎం హత్య: పదేళ్ల తర్వాత థాయ్‌లాండ్‌లో అరెస్టు
న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు జాగ్తర్ సింగ్ అలియాస్ తారాను పోలీసులు ధాయ్‌లాండ్‌లో సోమవారం అరెస్టు చేశారు. పాకిస్ధాన్‌కు చెందిన ఐఎస్ఐ అండతో థాయ్‌లాండ్‌లో ఇన్నాళ్లు తారా తలదాచుకున్నాడు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
1995, ఆగస్టు 31న పంజాబ్ సెక్రటేరియట్‌లో అప్పటి ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దాడిలో బియాంత్‌సింగ్‌తో పాటు మరో 17 మంది మరణించారు. ఈ ఘాతుకం ఖలిస్ధాన్ వేర్పాటువాదుల పనే అని దర్యాప్తులో తేలింది.

ఈ హత్యలో పాల్గొన్న ఖలిస్ధాన్ టైగర్ ఫోర్స్ తారాతో పాటు, మరో ముగ్గురు వేర్పాటువాదులు హవారా, బెహూరా, దేవ్‌సింగ్‌లను ఛండీఘడ్‌లోని బురైల్ జైలుకు తరలించారు. తర్వాత 2004లో ఆ నలుగురు జైల్లో సొరంగం తవ్వి తప్పించకుని నేపాల్ పారిపోయారు.
ఈ ఘటన ఆప్పట్లో పెను సంచలనం సృష్టించింది. హవారా, బెహూరా నేపాల్‌లో అరెస్టు చేసిన పోలీసులు... తారా మరో నిందితుడు దేవ్ సింగ్‌లు పాకిస్ధాన్‌కు పారిపోయారని తేల్చారు. పాకిస్ధాన్ పాస్ పోర్టుతో గత కొంతకాలంగా తారా థాయ్‌లాండ్‌లో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ దేశ పోలీసుల సహకారంతో సోమవారం అరెస్టు చేశారు.
ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న మరో నిందితుడు దేవ్‌సింగ్ పాకిస్తాన్‌లోనే ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications