మొదటిసారిగా బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డా నియామకం
జాతీయ బీజేపీకి మరో కొత్త సారధిని నియమించారు.గతంలో ఎప్పుడు లేని విధంగా జాతీయ పార్టీ తెరమీదకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని తీసుకువచ్చింది. ఈనేపథ్యంలోనే మాజీ కేంద్రమంత్రి జేపి నడ్డాను బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా నడ్డా ఇటివల జరిగిన ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌కు ఇంచార్జ్‌గా ఉన్నారు. యూపిలో పార్టీని గట్టేక్కించి మహఘట్‌బంధన్‌కు దీటుగా బీజేపీకి రెండవ సారి అధికారంలోకి రావడానికి యూపి నుండి అత్యధికంగా 62 స్థానాలు వచ్చిన విషయం
తెలిసిందే...

ప్రధాని అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ బోర్డు.
సోమవారం ఢిల్లిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈసమాశంలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు సుష్మాస్వరాజ్, రాంలాల్‌తో పాటు ,రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు ఇతర పార్టీ సీనియర్లు హజరయ్యారు. సమావేశం అనంతరం జేపి నడ్డాను వర్కింగ్ ప్రెసిడెంట్'గా కేంద్రమంత్రి రాజ్‌నాధ్ సింగ్ ప్రకటించారు.

నాలుగు రాష్ష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా కోనసాగింపు
పార్టీ చీఫ్‌గా ఉన్న అమిత్ షా ఇటివల జరిగిన ఎన్నికల్లో గాంధి నగర్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి హోంమంత్రిగా భాద్యతలు స్వీకరించాడు .ఈనేపథ్యంలోనే పార్టీకి కొత్త బాస్ కోసం పార్టీ సమావేశం కూడ ఏర్పాటు చేసింది. అయితే రానున్న కొద్ది రోజుల్లో మహరాష్ట్ర, జమ్ము కశ్మీర్ హర్యాణతోపాటు జార్ఘండ్ రాష్ట్ర్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్థుతం పార్టీ చీఫ్‌ను తప్పించే అంశాన్ని పక్కన పెట్టారు. ఎన్నికలు ముగిసేవరకు పార్టీ అధ్యక్షుడుగా అమిత్‌షానే కొనసాగించాలని నిర్ణయించారు. దీంతోపాటు కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను రానున్న సంవత్సరంలో కొనసాగించాలని నిర్ణయించారు

బీహార్ కు చెందిన పార్టీ సినియర్ నాయకుడు జేపినడ్డా..
బీహార్‌లోని బ్రహ్మణ కులంలో పుట్టిన జేపి నడ్డా పాట్నా యూనివర్సిటిలో పాట్నా యూనివర్సిటి పరిధిలోని తన గ్రాడ్యుయోషన్ పూర్తి చేశారు. అనంతరం ఎల్‌ఎల్‌బి పూర్తి చేసేందుకు హిమచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. కాగా యూనివర్సిటి పరిధిలోనే ఏబీవిపీ నాయకుడిగా పని చేశారు. ఈనేపథ్యంలోనే 1986-89 ప్రాంతంలో ఏబీవీపీ జాతీయ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా కూడ పని భాద్యతలు నిర్వహించారు. కాగా హిమచల్ ప్రదేశ్‌లో రెండు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడ భాద్యతలు నిర్వహించారు 2012లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన నడ్డా మొదటి సారి ఎన్నికైన బీజేపీ ప్రభుత్వంలో కేంద్రవైద్య శాఖ మంత్రిగా చేశారు. ఈనేపథ్యంలోనే
కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్‌భవ పథకాన్ని నడ్డా తీసుకువచ్చాడు.












Click it and Unblock the Notifications