
పద్మ అవార్డుల ప్రదానం : సుష్మా స్వరాజ్ తరఫున పద్మవిభూషణ్ అందుకున్న కుమార్తె బన్సురీ
కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన పద్మ అవార్డులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవాళ రాష్ట్రపతి భవన్ లో ప్రధానం చేశారు. ఇందులో పలువురు అవార్డు గ్రహీతలు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు.ఇందులో పలువురు రాజకీయ నేతలు, క్రీడాకారులు, వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారు ఉన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
విదేశాంగశాఖ మాజీ మంత్రి, దివంగత సుష్మాస్వరాజ్ తరఫున మరణానంతరం ఆమె కుమార్తె బన్సురీ స్వరాజ్ పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. విదేశాంగమంత్రితో పాటు వివిధ అంశాల్లో ఆమె చేసిన సేవలకు గుర్తుగా మరణానంతరం ఆమెకు కేంద్రం పద్మవిభూషణ్ అవార్డు గతంలో ప్రకటించింది. ఆమె తరఫున కుమార్తె బన్సురీ ఈ అవార్డును అందుకున్నారు.

ఇవాఅళ పద్మభూషణ్ అవార్డులు అందుకున్న వారిలో ఒలింపియన్ పీవీ సింధు, టోక్యో ఒలింపిక్స్ లో సత్తా చాటిన భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్, హిందుస్తానీ క్లాసికల్ ప్లేయర్ పండిట్ చానూలాల్ మిశ్రా వంటి వారు ఉన్నారు. సింగర్ అద్నాన్ సమీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగాఖేడ్కర్, ఎయిర్ మార్షల్ డాక్టర్ పద్మా బందోపాధ్యాయ్ పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న వారిలో ఉన్నారు. ప్రతిష్టాత్మక అవార్డులు అందుకోవడంపై విజేతలు సంతోషం వ్యక్తం చేశారు.