నూతన ఎన్నికల కమిషనర్‌గా అనూప్ చంద్ర పాండే నియామకం -యూపీ కేడర్ ఐఏఎస్, బీజేపీకి ఇష్టుడు
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)లో నూతన ఎన్నికల కమిషనర్ గా అనూప్ చంద్ర పాండే నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ కేడర్, 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పాండే, ఉత్తరప్రదేశ్ లో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. సీఎం యోగికి చాలా ఇష్టుడైన అధికారిగా పాండేకు పేరుంది.
కేంద్ర ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తోపాటు ఇద్దరు ఎలక్షన్ కమిషన్లు ఉంటారని తెలిసిందే. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మొన్న ఏప్రిల్ లో సీఈసీ పదవి నుంచి సునీల్ అరోరా రిటైర్ కాగా, ఆయన స్థానంలో సుశీల్ చంద్ర సీఈసీగా నియమితులయ్యారు. మరో కమిషనర్ గా రాజీవ్ కుమార్ కొనసాగుతుండగా, ఖాళీగా ఉన్న మూడో స్థానం ఇప్పుడు భర్తీ అయింది.

ఎన్నికల సంస్కరణపై త్వరగా నిర్ణయాలు తీసుకోవాలంటూ సీఈసీ సుశీల్ చంద్ర కేంద్రానికి లేఖ రాసిన రోజే కొత్త కమిషనర్ నియామకం జరగడం గమనార్హం. అనూప్ చంద్రపాడే నియామకంతో ఈసీ ఇప్పుడు ముగ్గురు కమిషనర్లతో నిండుకుంది.
1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అనూప్ చంద్ర పాండే గతంలో డిప్యూటేషన్ పై రక్షణ శాఖ అదనపు కార్యదర్శిగా, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు.












Click it and Unblock the Notifications