అమ్మాయిలు కిడ్నాప్, గ్యాంగ్ రేప్

కొచ్చి: స్కూల్ నుంచి ఇంటికి వెలుతున్న ఇద్దరు విద్యార్థినిలను కిడ్నాప్ చేసి అటవి ప్రాంతంలోకి తీసుకు వెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగింది. గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు కామాంధులను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

పతనంతిట్ట సమీపంలోని చెరిఎజికల్ గ్రామంలో నివాసం ఉంటున్న ఇద్దరు అమ్మాయిలు పతనంపట్టి ప్రభుత్వ పాఠశాలలో ఒకరు 9వ తరగతి, ఒకరు10వ తరగతి చదువుతున్నారు. వీరు నివాసం ఉంటున్న గ్రామం అటవి ప్రాంతం (ఏజెన్సీ) సమీపంలో ఉంటుంది.

Four boys were arrested in Pathanamthitta district in Kerala

గత శనివారం సాయంత్రం ఇద్దరు అమ్మాయిలు పాఠశాల నుంచి ఇంటికి బయలుదేరారు. మార్గం మద్యలో నలుగురు యువకులు ఇద్దరిని కిడ్నాప్ చేసి అటవి ప్రాంతంలోకి ఎత్తుకెళ్లారు. తరువాత అమ్మాయిలపై రాత్రి వరకు సామూహిక అత్యాచారం చేశారు.

అమ్మాయిలు ఇద్దరూ ఇంటికి వెళ్లిన తరువాత కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం చేసిన యువకులను అమ్మాయిలు గుర్తు పట్టడంతో అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

అమ్మాయిల గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న నిందితులు శనివారం సాయంత్ర మార్గం మద్యలో వారిద్దరిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని పోలీసులు చెప్పారు. అరెస్టు అయిన నలుగురూ విద్యార్థులే అని పోలీసులు తెలిపారు. అందరికి వైద్య పరిక్షలు నిర్వహించామని పోలీసులు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+