రేప్‌ను ప్రతిఘటించిన మహిళ హత్య: నలుగురి అరెస్టు

న్యూఢిల్లీ: తనపై జరిగిన అత్యాచార యత్నాన్ని అడ్డగించిన 40 ఏళ్ల మహిళను హత్య చేశారు. పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో జరిగిన ఈ సంఘటనలో నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారంనాడు తెలిపారు.

బీర్ పాల్ (21), మొహమ్మద్ నసీం అలియాస్ సమీర్, జితేందర్ అలియాస్ పాల్ (28), మంటు శర్మ (27)‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఐదో నిందితుడు నరేష్ అలియాస్ అన్నా (28) కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతన్ని పట్టుకోవడానికి ఓ పోలీసు బృందం మథురలో మకాం వేసింది.

ఉత్తమ్ నగర్‌లో కృష్ణా కాలనీలో గల పార్కులో ఓ మహిళ శవం పడి ఉందని ఫోన్ కాల్ రావడంతో సంఘటన మార్చి 29వ తేదీ ఉదయం వెలుగులోకి వచ్చింది. శవం కూలిన చెట్టు కొమ్మతో కప్పి ఉంది. ముఖంపై, తలపై గాయాలున్నాయి. నెత్తుటి మరకలు కనిపించాయి.

 Four held for murdering a woman who resisted rape bid

ఉత్తమ్ నగర్ మెట్రో స్టేషన్‌ నైట్ షెల్టర్‌లో ఉండే మహిళగా ఆమెను గుర్తించారు. మార్చి 28, 29తేదీల మధ్యరాత్రి మొహ్మద్ నసీం లైంగిక క్రీడకోసం ఆమెను తన మోటార్ సైకిల్‌పై తీసుకుని వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

నసీం ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు బీర్ పాల్, జితేందర్, మంటులను అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు రాత్రి వారు మద్యం సేవించి నసీం తెచ్చిన మహిళపై అత్యాచారానికి ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో దుస్తులు చించేశారు. బీర్ బాటిల్స్‌తో, రాళ్లతో ఆమెపై దాడి చేశారు. దాంతో ఆమె మరణించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+