దంపతులకు కవల పిల్లలు, హోటల్ లో రూమ్ తీసుకుని ఒకేసారి నలుగురు ?, డెత్ నోట్ లో !!
బెంగళూరు/మంగళూరు: దంపతులు సంతోంగా కాపురం చేశారు. వివాహం అయిన చాలా సంవత్సరాల తరువాత దంపతులకు ఆలస్యంగా కవల పిల్లలు పుట్టారు. కవల పిల్లలతో కలిసి దంపతులు చాలా హ్యాపీగా ఉన్నారు. కవల పిల్లల్లో ఓ అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. అయితే లాడ్జ్ లో రూమ్ తీసుకున్న దంపతులు కవల పిల్లలతో కలిసి ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
కర్ణాటకలోని మైసూరు సిటీలోని విజయనగరలో దేవేంద్ర (48) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. చాలా సంవత్సరాల క్రితం నిర్మలా (48) అనే మహిళను దేవేంద్ర పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు పుట్టకపోవడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న దేవేంద్ర, నిర్మలా దంపతులు చాలా సంవత్సరాల తరువాత చివరికి తల్లిదండ్రులు అయ్యారు.

దేవేంద్ర, నిర్మలా దంపతులకు చైతన్యా (9), చైత్రా (9) అనే కవల పిల్లలు ఉన్నారు. కుమారుడు, కుమార్తెతో కలిసి దేవేంద్ర, నిర్మలా దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈనెల 27వ తేదీన దేవేంద్ర, నిర్మలా దంపతులు మంగళూరు సిటీకి వెళ్లి అక్కడి కేఎస్ రావ్ రోడ్డులోని కరుణ లాడ్జ్ లో రూమ్ అద్దెకు తీసుకున్నారు. ఒక్కరోజు మాత్రమే తాము రూమ్ లో ఉంటామని దేవేంద్ర లాడ్జ్ సిబ్బందికి చెప్పాడు.
మార్చి 28వ తేదీన మేము మరో రెండు రోజులు లాడ్జ్ లోనే ఉంటామని దేవేంద్ర లాడ్జ్ సిబ్బందికి చెప్పాడు. గురువారం రాత్రి లాడ్జ్ ఖాళీ చెయ్యాల్సి ఉంది. అయితే రూమ్ లో నుంచి ఎవ్వరూ బయటకు రాకపోవడం, పిలిచినా స్పందించకపోవడంతో లాడ్జ్ సిబ్బందికి అనుమానం వచ్చింది. శుక్రవారం వేకువ జామున లాడ్జ్ సిబ్బంది, పోలీసులు మరో తాళంతో తలుపులు తీసి చూడగా దేవేంద్ర, నిర్మలా, చైతన్యా, చైత్రా అందరూ శవమై కనిపించారు. చేసిన అప్పులు తీర్చలేకపోతున్నామని, అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నామని దేవేంద్ర డెత్ నోట్ రాసి పెట్టాడని, కేసు దర్యాప్తు చేస్తున్నామని మంగళూరు సిటీ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications