వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నలుగురు అనుమానిత ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు, దేశమంతా హైఅలర్ట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పశ్చిమ బంగలో నలుగురు అనుమానిత ఐఎస్ ఉగ్రవాదులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరిని ఢాకాలోని జత్రాబరిస, ఖిల్‌ఖేట్ ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు పశ్చిమ బెంగాల్ పోలీసులు తెలిపారు.

అనుమానిత ఉగ్రవాదులుగా భావిస్తున్న వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లతో పాటు పలు జిహాదీ కరపత్రాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అరెస్టైన వారిలో ఐఎస్ ప్రాంతీయ సమన్వయ కర్త ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Four militants arrested in Dhaka suspected of having links to ISIS

దేశమంతా హైఅలర్ట్

రిపబ్లిక్ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ దేశ మంతా హైఅలర్ట్‌ను ప్రకటించింది. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో నిఘా పెంచాలని ఆయా రాష్ట్రాలకు హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. రిపబ్లిక్ వేడుకల సందర్భంగా ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలను ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. పాకిస్థాన్ సరిహద్దులో భద్రతదళాల పెంచేలా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 10 కంపెనీల బీఎప్‌ఎఫ్ బలగాలు మోహరించాయి. రిపబ్లిక్ వేడుకలకు తొలిసారి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వస్తుండటంతో ఢిల్లీలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

దేశ రాజధాని ఢిల్లీ మొత్తం కెమెరాల నిఘాలో ఉంది. పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

English summary
Four militants arrested in Dhaka suspected of having links to ISIS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X