Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000

తమిళనాడు శాసనసభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. భారీ వరాలు ప్రకటించింది. ప్రత్యక్ష నగదు బదిలీలు, ఉచిత సంక్షేమ పథకాలను ఇబ్బడి ముబ్బడిగా పొందుపరిచింది. కుటుంబంలోని మహిళా పెద్దలకు నెలకు 2,000 రూపాయల భత్యాన్ని, ప్రతి ఇంటికి రూ. 10,000 వన్ టైమ్ ఆర్థిక సాయాన్ని ఇస్తామని వెల్లడించింది. ఖర్చుల భారం తగ్గించేందుకు పొంగల్, దీపావళి, తమిళ నూతన సంవత్సరం సందర్భంగా సంవత్సరానికి మూడు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు అందిస్తామని తెలిపింది.

రైతుల కోసం 'ఉజవే తాయ్' పథకం కింద కేంద్ర పీఎం-కిసాన్ సాయానికి అదనంగా 3,000 రూపాయలు అందిస్తారు. దీనివల్ల మొత్తం వార్షిక సహాయం 9,000 రూపాయలు అవుతుంది. శాంతిభద్రతల కోసం జీరో ఎఫ్‌ఐఆర్ విధానాన్ని బీజేపీ అనుసరిస్తుంది. బాధితులు, సాక్షుల రక్షణ, మహిళలపై నేరాలకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ మేనిఫెస్టో హామీ ఇచ్చింది. మత్తుపదార్థాల నిర్మూలనకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో కూడిన తమిళనాడు డ్రగ్ నిర్మూలన విభాగాన్ని ప్రతిపాదించింది.

Free LPG Cylinders Rs 2000 Monthly for Women and and Rs 25000 subsidy to e-scooters NDA Promises

సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన హామీలను కూడా ఇచ్చింది బీజేపీ. తిరుపురంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే సంప్రదాయాన్ని తిరిగి ప్రారంభిస్తామని పేర్కొంది. ఈ సంప్రదాయన్ని భవిష్యత్ తరాలకు కొనసాగించడంతో పాటు దీన్ని పరిరక్షిస్తామని పార్టీ భరోసా ఇచ్చింది. సత్వర న్యాయాన్ని అందించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సులు, పాఠశాలలు, యూనివర్శిటీల్లో 100 శాతం బ్లైండ్-స్పాట్ లేని విధంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు.

మహిళలు ఈ-స్కూటర్లను కొనుగోలు చేయడానికి 25,000 రూపాయల సబ్సిడీ ఇస్తారు. జీవితంలో మొదటిసారిగా ఇంటిని కొనుగోలు చేసే వారికి స్టాంప్ డ్యూటీలో మూడు శాతం రాయితీని అమలు చేస్తుంది బీజేపీ. స్వయం సహాయక బృందాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 50 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను కల్పిస్తామని పేర్కొంది. జల్లికట్టు ఎద్దుల పెంపకందారులకు ప్రతి నెలా 2,000 రూపాయల ఆర్థిక సాయం, జల్లికట్టు పోటీలలో పాల్గొనేవారు మరణిస్తే 10,00,000 రూపాయల పరిహారాన్ని బీజేపీ ప్రకటించింది.

బీజేపీ హిందుత్వ అజెండాకు అనుగుణంగా తైపూసాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది. తమిళనాడు రైల్వే నెట్‌వర్క్‌ ఆధునీకరణ, సరసమైన ధరలకు భూసేకరణ చేపట్టి, కనెక్టివిటీని గణనీయంగా విస్తరిస్తామని తెలిపింది. చెన్నై-బెంగళూరు, చెన్నై-హైదరాబాద్ వంటి హైస్పీడ్ రైలు కారిడార్లు, కోయంబత్తూరు-తిరుప్పూర్ సేలం ఆర్ఆర్టీఎస్, విలుప్పురం-చెన్నై సెమీ-అర్బన్ రైలు, జలశక్తి రైలు ప్రాజెక్ట్‌లను అమలు చేయాలని ప్రతిపాదించింది.

చెన్నైని ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలతో అనుసంధానించే కొత్త స్లీపర్ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని కూడా బీజేపీ హామీ ఇచ్చింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర శాఖ నైనార్ నాగేంద్రన్, మాజీ అధ్యక్షుడు కే అన్నామలై, సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందర్‌రాజన్ వంటి ప్రముఖులు దీనిని ఆవిష్కరించారు. తమిళ నూతన సంవత్సరం శుభదినాన మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించిందని నడ్డా చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+