Economic Survey: ముంచేస్తుున్న ఉచిత పథకాలు-ఆర్ధికసర్వే షాకింగ్-పరిష్కారమిదే..!

దేశవ్యాప్తంగా కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాలు పేదలు, మహిళలు, ఇతర వర్గాలకు అందిస్తున్న ఉచిత పథకాల వల్ల ఆర్ధిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోతోందని ఆర్ధిక సర్వే (economic survey) వెల్లడించింది. తాజాగా పార్లమెంట్ లో ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన ఆర్ధిక సర్వేలో ఉచిత పథకాల వల్ల జరుగుతున్న నష్టాన్ని కూలంకషంగా వివరించడంతో పాటు దీని పరిష్కారానికి బ్రెజిల్ మోడల్ ను సూచించింది. దీంతో ఉచితాల ధోరణితో పాటు బ్రెజిల్ మోడల్ పైనా చర్చ జరుగుతోంది.

ఆర్ధిక వ్యవస్థను ముంచేస్తున్నఉచితాలు

మన దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఉచిత పథకాల పంపిణీ ఆర్ధిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టడం ప్రారంభించిందని 2025-26 సంవత్సర ఆర్ధిక సర్వే హెచ్చరించింది. ముఖ్యంగా రాష్ట్రాలు దూకుడుగా అమలు చేస్తున్న షరతులు లేని నగదు బదిలీలు గత మూడు ఆర్ధిక సంవత్సరాల్లో ఐదు రెట్లు పెరిగాయని తెలిపింది. ఈ సంవత్సరం వీటిపై పెడుతున్న ఖర్చు రూ. 1.7 లక్షల కోట్లకు చేరుకుందని పేర్కొంది. రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రోత్సాహకాలు, నిజమైన సంక్షేమ ఉద్దేశం యొక్క శక్తివంతమైన మిశ్రమం ద్వారా ఉచిత పథకాల్లో పెరుగుదల వచ్చిందని సర్వే పేర్కొంది. 2023 నుంచి షరతుల్లేని నగదు పంపిణీ పథకాలను అందించే రాష్ట్రాల సంఖ్య బాగా పెరిగిందని తెలిపింది. తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, హర్యానా మహిళా కేంద్రీకృత నగదు బదిలీలను ప్రారంభించాయని పేర్కొంది.

Freebie Crisis Economic Survey Proposes Brazilian Model to Stop India s Economic Bleeding


తక్షణ ఊరట-శాశ్వత నష్టం

మహిళలను లక్ష్యంగా చేసుకుంటూ ప్రభుత్వాలు అందిస్తున్న ఈ పథకాలు తక్షణ ఆదాయ ఉపశమనాన్ని అందించాయని, ఆదాయ వినియోగాన్ని పెంచాయని ఆర్ధికసర్వే తెలిపింది. అయితే పోషకాహారం, విద్య అందించడం, పేదరికం తగ్గింపులో అవి శాశ్వత లాభాలను అందించడంలో విఫలమయ్యాయని పేర్కొంది. వాటికి బదులుగా అవి ఆదాయ లోటులను పెంచాయని తెలిపింది. వీటి వల్ల మూలధన వ్యయం తగ్గిపోవడంతో పాటు రాష్ట్రాల ఆర్థిక సరళత కఠినతరం అయిందని తెలిపింది. అనేక రాష్ట్రాలలో షరతులు లేని నగదు బదిలీల విస్తరణ ఆదాయ వ్యయం పెరగడానికి దోహదపడిందని, దీని వల్ల రాష్ట్రాల ఆరర్ధిక స్దితితో పాటు ప్రభుత్వ పెట్టుబడులపైనా ప్రభావం పడుతోందని హెచ్చరించింది. రాష్ట్ర ఆదాయంలో దాదాపు మూడింట రెండు వంతులకు చేరుకున్న ఈ ఉచిత పథకాల పంపిణీ వల్ల మౌలిక సదుపాయాలు , మానవ మూలధన పెట్టుబడులకు గండి పడుతోందని ఆర్ధిక సర్వే తెలిపింది. ఎలాంటి సంస్కరణలు లేకుండా ఈ ఉచిత పథకాల డబ్బు బదిలీలు లబ్దిదారులకు భద్రతా వలయాలుగా కాకుండా శాశ్వత ఆర్థిక బాధ్యతలుగా మారే ప్రమాదం ఉందని సర్వే హెచ్చరిస్తోంది. ఉచితాలు మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని తగ్గించాయని కూడా వెల్లడించింది.

Freebie Crisis Economic Survey Proposes Brazilian Model to Stop India s Economic Bleeding

బ్రెజిల్ మోడలే పరిష్కారం

ఉచిత పథకాల వల్ల కలుగుతున్న ఆర్థిక నష్టాన్ని అరికట్టడానికి షరతులతో కూడిన, కాలపరిమితి గల సంక్షేమం వైపు మళ్లాలని ఆర్ధిక సర్వే ప్రతిపాదించింది. బ్రెజిల్‌, మెక్సికో, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న షరతులతో కూడిన సంక్షేమ మోడళ్లను ఉదాహరణలుగా చూపించింది. ఇందులో పథకాలకు షరతులు పెట్టడం, అలాగే కాలపరిమితి పెట్టడం చేయాలని ఆర్ధిక సర్వే సూచిస్తోంది. అంతిమంగా ఫలితాలు లేని సంక్షేమం ఆర్థికంగా స్థిరంగా ఉండదని గుర్తుచేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+