మమల్ని ఎవ్వరూ భయపెట్టలేరు: హోలాండే
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విశిష్ట అతిథిగా పాల్గోన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలండే భారత్ వదిలి స్వదేశానికి వెలుతున్న సమయంలో ఉగ్రవాదుల విషయంలో ఘాటుగానే స్పందించారు.
గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గోన్న ప్రాంకోయిస్ హోలండేకు మంగళవారం సాయంత్రం విమానాశ్రయంలో భారత్ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్బంగా ప్రాంకోయిస్ హోలండే విలేకరులతో మాట్లాడారు.

ఫ్రాన్స్, భారత్ స్వేచ్చా స్వాతంత్య్రాలకు నిర్వచనాలుగా నిలుస్తాయని, అందుకే ఈ రెండు దేశాలపై ఉగ్రవాదులు పదేపదే దాడులు చేస్తున్నారని గుర్తు చేశారు. ఉగ్రవాదంపై పోరులో తాము వెనకడుగు వేయబోమని ఆయన తేల్చి చెప్పారు.
మేము దేనికి భయపడం, మమ్మల్ని ఎవ్వరూ భయపెట్టలేరని, ఉగ్రవాదుల పీచమణిచే విషయంలో ఎలాంటి సందేహం లేదని ప్రాంకోయిస్ హోలాండే స్పష్టం చేశారు. ఉగ్రవాదుల అంతు చూడటానికి తాము భారత్ తో కలిసి పని చెయ్యడానికి సిద్దంగా ఉన్నామని ప్రాంకోయిస్ హోలాండే చెప్పారు.












Click it and Unblock the Notifications