యోగా చేస్తూ.. బెంగళూరుకు బైబై చెబుతూ కేజ్రీవాల్ (పిక్చర్స్)
బెంగళూరు: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ క్రేజీవాల్ పూర్తి ఆరోగ్యంతో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బెంగళూరు-తుమకూరు రోడ్డులోని జిందాల్ ప్రకృతి చికిత్సాలయంలో ఇన్ని రోజులు చికిత్స పోందిన క్రేజీవాల్ అరోగ్యం కుదటపడింది.
ప్రతి రోజు ఆసుపత్రిలో యోగ, ధ్యానం, వాకింగ్ చేశారు. క్రేజీవాల్ కు వైద్యలు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. రోగులకు ఎలాంటి బోజనం ఇస్తారొ అదే ఆహారం క్రేజీవివాల్ కు ఇచ్చారు. క్రేజీవాల్ కు షుగర్ కంట్రోల్ అయ్యింది. ఆయనకు దగ్గు పూర్తిగా తగ్గిపోయింది. రక్తపోటు కంట్రోల్ అయ్యింది.
క్రేజీవాల్ ఆరోగ్యం కుదట పడటంతో వైద్యులు డిస్చార్జ్ చెయ్యాలని నిర్ధారించారు. ఇన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న క్రేజీవాల్ సోమవారం ఆసుపత్రి నుండి బయటకు వచ్చారు. ఆప్ శాసన సభ్యులు, పలువురు సీనియర్లు, కర్ణాటక ఆప్ విభాగం నాయకులు క్రేజీవాల్ ను కలిశారు.
తరువాత క్రేజీవాల్ మద్యాహ్నం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

జిందాల్ ప్రకృతి చికిత్సాలయం వైద్యురాలు బబితా నందకుమార్ నేతృత్వంలో క్రేజీవాల్ కు చికిత్స అందించారు.

10 రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో వైద్యుల సూచించిన విదంగా యోగా, ధ్యానం, వాకింగ్ చేశారు.

ప్రతి రోజు వేకువ జామున 5 గంటల నుండి క్రేజీవాల్ దినచర్య మొదలయ్యింది.

ఆయనకు అన్ని రకాల వైద్య చికిత్స అందించారు. క్రేజీవాల్ కు ప్రతి రోజు రూ. 24 వేల చోప్పున వైద్య ఖర్చులు అయ్యాయని సమాచారం.













Click it and Unblock the Notifications