ఇదేం బర్త్ డే సెలబ్రేషన్.. పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితులు !!
పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో అని కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పబోయే విషయం కూడా ఆ కోవలోకే వస్తుంది. మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుతం ఉన్న ఈ GEN Z యువత చేసే పిచ్చిచేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయి. యావగింపు పనులతో చీదర పుట్టిస్తూ కోరి చావును కొని తెచ్చుకుంటున్నారు. స్టంట్‌ల పేరుతో బైక్ రైడ్లకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారంతా ఒక వైపు ఉంటే.. ఇప్పుడు బర్త్ డే సెలబ్రేషన్స్ లోనూ అడ్డమైన పనులు చేసేస్తున్నారు.
కేక్‌ను ముఖానికి పూయడం మొదలు శరీరంపై స్ప్రే వేసి దానికి నిప్పంటించడం, బర్త్‌డే బాయ్‌ను మురికి కాలవలో తోయడం.. ఇలాంటి పనులతో సమాజాన్ని కంపు కొట్టిస్తున్నారు. చివరకు కన్నవాళ్లకు కడుపుకోత మిగుల్చుతున్నారు. ఇవేం పనులను ఎవరైన ప్రశ్ని్స్తే..వాళ్లపైనే దాడులకు తెగబడుతున్నారు. అయితే ముంబైలో కొందరు కుర్రాళ్లు...మరి మితిమీరిపోయారు. బర్త్ డే బంప్స్ అంటూ హద్దులు దాటారు. పుట్టినరోజు పేరుతో చేసిన ఓ నీచపు పని... యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. ఇప్పుడా కుర్రాడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

అసలేం జరిగిందంటే..
ఆరుగురు స్నేహితుల్లో ఒకడైన అబుల్ రెహమాన్‌ది గత నెల 24న పుట్టినరోజు. ఆ బ్యాచ్‌లో ఉన్న అయాజ్ మాలిక్....అబుల్‌కు ఫోన్ చేసి కేక్ కట్ చేద్దామనంటూ పిలిపించాడు. వారిలో మరో దోస్త్ షరీఫ్..అబుల్‌ను కోహినూర్ ఫేజ్ 3 సొసైటీలోని వింగ్ నంబర్ 26 వద్దకు రావాలని చెప్పాడు. వారు చెప్పినట్టుగానే అబుల్ అక్కడికి వెళ్లాడు. అప్పటికే అక్కడున్న అయాజ్ మాలిక్, అష్రఫ్ మాలిక్, ఖాసిం చౌదరి, హుజైఫా ఖాన్, షరీఫ్....అబుల్ రాగానే కేక్ కట్ చేయించారు. అప్పటి వరకూ బాగానే ఉన్నారు.
ఇంతలో ముందుగానే ప్లాన్ చేసుకున్న షరీఫ్ బ్యాచ్...అబుల్‌పై రాళ్ల దాడి చేశారు. అక్కడితో ఆగారా? లేదు. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను కూడా అబుల్‌పై పోశారు. అబుల్ భయంతో పరుగులు తీశాడు. పట్టుకునే క్రమంలో అయాజ్...తన వద్ద ఉన్న లైటర్‌తో అబుల్‌కు నిప్పంటించాడు. దీంతో అబుల్ బట్టలు కాలిపోయాయి. ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగులు పెట్టాడు.
వెంటనే పక్కనే ఉన్న ఒక సెక్యురిటీ గార్డు చూసి అతనిపై నీళ్లు పోశాడు. అయినా మంటలు చల్లారకపోవడంతో పక్కనే ఉన్న కుళాయి దగ్గరకు వెళ్లి మంటలారే దాకా నీళ్లు పోసుకున్నాడు అబుల్. అప్పటికే అబుల్‌కు తీవ్రగాయాలయ్యి ముఖం, చెవులు, జుట్టు, ఛాతీ, రెండు చేతులకు బలమైన గాయాలయ్యాయి. ఈ ఘటనలో పోలీసులు బాధితుడి స్నేహితులపై కేసు నమోదు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications