Calcutta High Court: భర్త, మహిళ మధ్య స్నేహం వివాహేతర సంబంధమేనా?.. కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Culcutta High Court: భర్త సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని నిర్లక్ష్యంగా ఆరోపించడం మానసిక క్రూరత్వానికి సమానమేనని కలకత్తా హైకోర్టు వ్యాఖ్యానించింది. స్త్రీ, పురుషుల మధ్య స్నేహాన్ని నేటి సమాజంలో అక్రమ సంబంధంగా భావించలేమని కోర్టు చెప్పింది. ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయకపోవడంతో ఓ భర్త(పిటిషనర్) కలకత్తా హైకోర్టులో అప్పీల్ చేశారు. జస్టిస్ సబ్యసాచి భట్టాచార్య, జస్టిస్ ఉదయ్ కుమార్ లతో కూడా డివిజన్ బెంచ్ భర్త విడాకుల కోసం చేసిన అప్పీల్ ను క్రూరత్వం కారణంగా అనుమతించింది. భార్య నిరాధారమైన ఆరోపణల వల్ల ఇద్దరి మధ్య వివాహ బంధం తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతిన్నట్లు తీర్పులో న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసును విచారిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలను చేసింది. సహోద్యోగితో వివాహేతర సంబంధం ఉందంటూ భర్తపై తప్పుడు ఆరోపణలు మానసిక క్రూరత్వేమే అని తీర్పు చెప్పింది.
భర్త, మహిళా సహోద్యోగికి స్నేహం కారణంగా సంబంధాన్ని అంటగట్టడం ఆమోదయోగ్యం కాదని.. ఆ స్నేహాన్ని వివాహేతర సంబంధంగా భావించి గొడవలకు దిగడం యోగ్యం కాదని.. ఏ స్వతంత్ర సాక్షి కూడా ధ్రువీకరించని సందర్భంలో ఆ ఆరోపణలను నిరాధారమైనవిగా పరగణించాల్సి ఉంటుందని కోర్టు చెప్పింది. హిందూ వివాహ చట్టం-1955 ప్రకారం ఫ్యామిలీ కోర్టు విడాకులను నిరాకరించింది. అనుమానాలతో వైవాహిక వివాదాలు తప్పనిసరిగా క్రూరత్వంగా పరిగణించబడవని ఫ్యామిలీ కోర్టు పేర్కొంది. ఫ్యామిలీ కోర్టు తన విడాకులకు నిరాకరించగా భర్త హైకోర్టును ఆశ్రయించారు.

ఎలాంటి ఆధారాలు లేకున్నా భార్య పదే పదే సహోద్యోగితో వివాహేతర సంబంధం ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తోందని హైకోర్టులో భర్త వాదించారు. బంధువులు, సహోద్యోగుల సమక్షంలో ఈ ఆరోపణలు తనకు తీవ్రమైన మానసిక గాయాన్ని, సామాజిక ఇబ్బందిని కలిగించిందని చెప్పారు. అంతే కాకుండా భార్య తనపై, తన కుటుంబంపై ఎటువంటి ఆధారం లేకుండా అనేక క్రిమినల్ కేసులు దాఖలు చేసిందని న్యాయస్థానానికి తెలిపారు. వరకట్న సంబంధిత హింస, వ్యభిచారం వంటి ఫిర్యాదులను భార్య తన భర్త, అతని కుటుంబ సభ్యులపై దాఖలు చేశారని హైకోర్టు గుర్తించింది. భార్య సాక్ష్యాలు అందించడంలో విఫలమైందని.. సమాజంలో భర్త పరువును దెబ్బతీసినట్లు న్యాయస్థానం గుర్తించింది. భర్తల వెళ్లిన ప్రతి సారీ తన వద్దకు తిరిగి రావాలని బలవంతం చేయడానికి భార్య నేర ఫిర్యాదులను ఒక సాధనంగా ఉపయోగిస్తోందని కోర్టు తెలుసుకుంది.
"భార్య తన భర్తతో కలిసి జీవించాలనుకుంటున్నట్లు నిరంతరం తెలియజేస్తూనే ఉంది, కానీ ఏకకాలంలో ఒకదాని తర్వాత ఒకటి క్రిమినల్ ఫిర్యాదులను దాఖలు చేస్తోంది. ఇది నేరపూరిత స్వభావం మాత్రమే కాకుండా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది." అని హైకోర్టు పేర్కొంది. ఇలాంటి సరిదిద్దుకోలేని బంధాన్ని బలవంతం చేయడం సమర్థనీయం కాదని.. ఫ్యామిలీ కోర్టు తీర్పును పక్కనపెట్టి.. ఇద్దరి వివాహాన్ని రద్దు చేస్తూ విడాకులను మంజూరు చేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications