వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

International Friendship Day 2021 : ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు...

|
Google Oneindia TeluguNews

నిజమైన స్నేహితుడు ఒక్కడున్నా చాలు... వెంట ఒక సైన్యం ఉన్నంత బలం. బాధలో,సంతోషంలో,జీవితపు ప్రతీ మలుపులో వెన్నంటి ఉండే స్నేహితుడు ఉండటం ఒక గొప్ప భరోసా. నీది కాని రోజున సైతం నీవైపు నిలబడే స్నేహితుడు ఒకడు ఉన్నాడంటే.. ఎంతటి వేదననైనా తట్టుకునే స్థైర్యం,ఎంతటి సవాల్‌నైనా స్వీకరించే తెగువ ముందుకు నడిపిస్తుంది. ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఎంతోమంది తమ ఆత్మీయ మిత్రుల గురించి మనసులో ఇలా తలుచుకుంటారంటే అతిశయోక్తి కాదేమో... స్నేహితుల దినోత్సవం నేపథ్యంలో అసలు అదెలా ఏర్పడిందో తెలుసుకుందాం..

మొట్టమొదటిసారిగా జులై 30,1958న ఫ్రెండ్‌షిప్‌ ప్రతిపాదన తెర పైకి వచ్చింది. అప్పట్లో వరల్డ్ ఫ్రెండ్‌షిప్ క్రూసేడ్ అనే ఆర్గనైజేషన్ దీన్ని ప్రతిపాదించింది.ఆ తర్వాతి కాలంలో1998లో అప్పటి ఐరాస సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ భార్య నానే అన్నన్ 'విన్నీ పూఫ్' అనే కార్టూన్ క్యారెక్టర్‌ను ఫ్రెండ్‌షిప్ డే వరల్డ్ అంబాసిడర్‌గా పేర్కొన్నారు.

Friendship Day 2021: Date In India and Significance Wishes Messages Quotes In Telugu For Best Friends

ఎట్టకేలకు, 27 ఏప్రిల్,2011న ఐక్యరాజ్య సమితి అధికారికంగా ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే తేదీని జూలై 30గా గుర్తించింది. అయినప్పటికీ భారత్,బంగ్లాదేశ్,మలేషియా,యూఏఈ,యూఎస్ వంటి చాలా దేశాల్లో అగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్‌షిప్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. కేవలం వ్యక్తుల మధ్యే కాదు,దేశాలు,కమ్యూనిటీలు,భిన్న సంస్కృతుల మధ్య సత్సంబంధాలు,స్నేహపూర్వక భావనను పెంపొందించాలన్న ఉద్దేశంతో జులై 30వ తేదీని ఫ్రెండ్‌షిప్‌ డేగా ప్రకటించారు.

నిజానికి ఈ ఫ్రెండ్‌షిప్ డే ఆలోచన వెనుక ఒక మార్కెట్ స్ట్రాటజీ ఉందన్న ప్రచారం ఉంది.1930లో జోయ్స్ హాల్ అనే వ్యక్తి హాల్ మార్క్ కార్డుల అమ్మకాల కోసం ఫ్రెండ్‌షిప్‌ డే అనే దాన్ని పుట్టించినట్లుగా చెబుతారు. ఆరోజు సన్నిహితులు,ఆత్మీయులకు గ్రీటింగ్ కార్డుల ద్వారా విషెస్ చెప్పాలన్న ఆలోచనను పుట్టించాడని.. తద్వారా వాటి అమ్మకం పెంచుకోవడానికి దీన్నో మార్కెటింగ్ స్ట్రాటజీగా వాడుకున్నాడని చెప్తారు. ఆ తర్వాతి రోజుల్లో అమెరికా కాంగ్రెస్ సైతం అగస్టు మొదటి ఆదివారాన్ని అధికారికంగా నేషనల్ ఫ్రెండ్‌షిప్‌ డేగా గుర్తించి ఆరోజు హాలీ డేగా ప్రకటించింది.

కొన్నేళ్ల క్రితం వరకూ ఫ్రెండ్‌షిప్ డే అనగానే గ్రీటింగ్ కార్డుల సందడి కనిపించేది. కానీ స్మార్ట్ ఫోన్స్,ఇంటర్నెట్,సోషల్ మీడియా రాకతో అంతా మారిపోయింది. వాట్సాప్,ఫేస్‌బుక్,ట్విట్టర్,షేర్ చాట్ ఇలా రకరకాల మాధ్యమాల్లో ఇప్పుడు స్నేహితులను విష్ చేస్తున్నారు. ఆకట్టుకునే కోట్స్‌తో పోస్టులు పెడుతున్నారు.

English summary
According to the United Nations, the UN General Assembly proclaimed July 30 as International Day of Friendship with the idea that friendship between peoples, countries, cultures and individuals can inspire peace efforts and build bridges between communities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X