అదానీ పై కుట్ర చేస్తోంది ఎవరు..నిధులు ఎలా వస్తున్నాయి..?

దేశీయ పారిశ్రామిక దిగ్గజం, అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత గౌతమ్ అదానీపై ఆర్థికపరమైన దాడి చేయడానికి హిండెన్‌బర్గ్‌‌ను నియమించుకున్న అమెరికన్ చైనీస్ ఇన్వెస్టర్/చైనీస్ గూఢచార్యం ఇటీవలే బహిర్గతం కావడం, సీనియర్ అడ్వొకేట్ మహేశ్ జెఠ్మలానీ చైనా హస్తం గురించి ఆరోపణలు చేయడం అదానీ వ్యవహారాన్ని స్పై థ్రిల్లర్‌గా మార్చివేశాయి.

ఈ వరుస పరిణామాలు అనేక ప్రశ్నలను లేవనెత్తాయి. అదానీ వంటి భారత వ్యాపార, పారిశ్రామిక దిగ్గజంపై ఈ తరహా దాడులను చేయడంలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాల్లో ఒకటి ఎందుకు ఉంది?, చైనాకు వ్యతిరేకంగా అదానీకి అమెరికా ఎందుకు మద్దతు ఇస్తోంది?.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గుజరాత్‌లో అదానీకి చెందిన ముంద్రా, ఖవ్డా సైట్లను భారత్‌లోని అమెరికా రాయబారి ఇటీవలే సందర్శించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికీ వెనుకాడలేదు. దీని ద్వారా అదానీకి అమెరికా మద్దతుగా నిలిచిందనే సంకేతాలను ఆ రాయబారి పంపించినట్టయింది.

Adani and Srilanka

నవంబర్ 2023లో అదానీకి చెందిన కొలంబో పోర్ట్ ప్రాజెక్ట్‌కు ఆర్థిక సహాయం అందించిన అమెరికా ప్రభుత్వానికి చెందిన డీఎఫ్‌సీ అనే సంస్థ హిండెన్‌బర్గ్ నివేదికను అసంబద్ధం అంటూ తేల్చి పడేసింది. దీన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఈ పరిణామం- దేశీయ స్టాక్ మార్కెట్‌లో అదానీ షేర్ల విలువను అమాంతం పెంచింది. నష్టాన్ని రికవరీ చేసింది.

2017లో రాహుల్ గాంధీ చైనా మంత్రులను కలవడానికి ఆ దేశ రాయబార కార్యాలయాన్ని రహస్యంగా సందర్శించారంటూ వార్తలు రాగా.. దాన్ని ఆయన తోసిపుచ్చారు. ఆ సమావేశానికి సంబంధించిన ఫొటోను చైనా ఎంబసీ విడుదల చేసిన తరువాతే ఆ విషయాన్ని అంగీకరించారు. కైలాష్ మానస సరోవర్ యాత్ర పేరుతో 2018లో రాహుల్ గాంధీ మళ్లీ రహస్యంగా చైనా మంత్రులను కలిశారు. ఇది- కాంగ్రెస్ పార్టీ ఎందుకు అదానీని వెంటాడుతోంది అనే ప్రశ్నను రేకెత్తించింది.

ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో ఎందుకు స్నార్కెలింగ్‌కు వెళ్లారు? ఆయన లక్ష్యం మాల్దీవులా లేక లేక చైనా ప్రభుత్వమా? బయట మన కంటికి కనిపించే దానికంటే ఎక్కువ పరిణామాలు అప్పుడు చోటు చేసుకున్నాయా?

ఓ భారీ కుట్రను అర్థం చేసుకోవాలంటే- ముందుగా భౌగోళిక, రాజకీయ పరిస్థితులు, వాణిజ్య మార్గాల గురించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చరిత్ర మొత్తం కూడా ఎకనామిక్ కారిడార్లు, పోర్టుల నియంత్రణపై వివాదాలు ప్రపంచ దేశాల శక్తి సామర్థ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాయి.

క్రీస్తుపూర్వం 1453లో కాన్‌స్టాంటినోపిల్‌ను స్వాధీనం చేసుకోవడం ద్వారా- ఒట్టామన్ టర్క్స్ పట్టు వస్త్రాల రవాణా మార్గాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ చర్య- ఆ యుగంలో అత్యంత శక్తివంతమైనదిగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. తన దేశాన్ని శక్తిమంతమైన సామ్రాజ్యంగా మార్చగలిగారు.

ఆఫ్రికా పశ్చిమ తీరంలో సముద్ర మార్గాలను కనుగొనడం ద్వారా యూరోపియన్లు ఒట్టోమన్లను బలహీనపరిచారు. ఇది యూరోపియన్ (పోర్చుగీస్, బ్రిటిష్, డచ్, ఫ్రెంచ్) సామ్రాజ్యాల విస్తరణకు దారితీసింది.

ఇప్పుడు- ప్రపంచ దేశాల శక్తి సామర్థ్యాలు.. తూర్పు వైపునకు వేగంగా అడుగులు వేస్తోన్నాయి. 21 శతాబ్దపు ప్రపంచ భౌగోళిక, రాజకీయ సమీకరణాలు మారుతున్న క్రమంలో ఆధిపత్యం చేతులు మారుతోంది. పోర్టులు బలంగా ఉన్న దేశాలు ఆధిపత్యం చలాయిస్తాయి. ఈ విషయంలో ఇటీవలి కాలం వరకు చైనా విజేతగా నిలిచింది.

తన వాణిజ్య, సైనిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి, అ రీజియన్‌లో గుత్తాధిపత్యాన్ని సాధించడానికి చైనా ఒక ట్రిలియన్ డాలర్ల వన్ బెల్ట్ అండ్ వన్ రోడ్ ఇనిషియేటివ్ బీఆర్ఐ స్ట్రాటజీని అనుసరించింది. ఇందులో చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ ఉన్నాయి. హిందూ మహా సముద్రం ఆధారంగా చోటు చేసుకున్న ఈ పరిణామం- భారత జాతీయ భద్రతకు అతిపెద్ద ముప్పుగా పరిగణించవచ్చు.

కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ వాణిజ్య మార్గాలపై చైనా సాధించిన గుత్తాధిపత్యాన్ని సవాల్ చేస్తూ భారత్ నుండి ఓ పేరు ఉద్భవించింది. అది ప్రభుత్వం కాదు గానీ- ఓ ప్రైవేట్ ప్లేయర్‌కు సంబంధించిన పేరు. భారత పశ్చిమ తీరంలో అత్యంత శక్తిమంతమైన పోర్ట్ ముంద్రాను నిర్మించడంలో విజయం సాధించింది. ఆ పేరును మీడియా తరచుగా మోదీ మిత్రుడిగా పిలుస్తుంటుంది.

బ్రిటీషర్ల తరువాత- అదానీ గ్రూపు మొట్టమొదటి, ఏకైక దేశీయ ఓడరేవు. మౌలిక సదుపాయాల రంగంలో అతిపెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను నిర్మించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. దేశ ఓడరేవుల రంగంలో ఇది మిగిలిన అన్ని ఇతర పోర్ట్‌లను ఒంటిచేత్తో ఓడించగలిగింది.

మొదటి రెండు దశాబ్దాల కాలం పరిస్థితుల గురించి అధ్యయనం చేస్తూ, ఓడరేవులను విస్తరించుకుంది. ముంద్రా పోర్ట్ కార్యకలాపాలు కేంద్ర బిందువుగా అదానీ మొత్తం తీరప్రాంతంలో వరుస పోర్టుల కొనుగోళ్లతో దేశంలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.

దేశ పునర్నిర్మాణంలో ఉన్నామంటూ చెప్పుకొనే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బెహెమోత్ కూడా 2010 నుండి విదేశాలలో ఉనికిని పెంచుకోవడంలో భాగంగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది. దీనితో ఇది- చైనాను తలదన్నేలా చేసింది. చైనాకు అదానీని గద్దె దించడంలో సగం విజయం సాధించినట్టయింది.

అదానీ vs చైనా

చైనా తరువాత, అదానీ ఈ రంగంలో బలంగా అడుగు పెట్టింది. ప్రపంచంలోనే వనరులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పాదం మోపిన సంస్థల్లో మొదటి భారతీయ కంపెనీగా నిలిచింది. ఆస్ట్రేలియా కార్యకలాపాలలో ఇప్పటి వరకు తొమ్మిది బిలియన్ల సొంత నిధులు/ఈక్విటీని పెట్టుబడి పెట్టింది.. అదాని సంస్థ.

అదాని కంటే ముందు బొగ్గు సహా ఆస్ట్రేలియా సహజ వనరులను చైనీయులు అధికశాతం కొనుగోలు చేశారు. అదానీ రాకతో ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి తెర పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. 2020లో ఆస్ట్రేలియాలోని యాంకోల్ గనులు కలిగిన చైనా బొగ్గు దిగ్గజం.. అదానీ ఆస్ట్రేలియాలో ఉత్పత్తి చేసిన దానిలో 20 రెట్లు ఎక్కువ ఉత్పత్తి చేసింది. ఇది మొత్తం ఎగుమతుల్లో 40 శాతం.

1.ఆస్ట్రేలియాలో..

ఆగస్టు 2010 - ఆస్ట్రేలియాలోని కార్మైకేల్ గనులను అదానీ స్వాధీనం చేసుకుంది. సహజ వనరుల కోసం ఆస్ట్రేలియాలో వెంచర్ చేసిన మొట్ట మొదటి భారతీయగా ఆవిర్భవించింది. అప్పటి వరకు ఆస్ట్రేలియా నుంచి బొగ్గు ఎగుమతులు ఎక్కువ భాగం చైనా, ఇతర తూర్పు ఆసియా దేశాలకు వెళ్లేవి.

మే 2011- భారత్‌కు బొగ్గును ఎగుమతి చేయడానికి ఆస్ట్రేలియాలోని నార్త్ క్వీన్స్‌లాండ్‌లోని అబాట్ పాయింట్ కోల్ టెర్మినల్‌ను అదానీ కొనుగోలు చేసింది.

2012 - #STOPADANI అనే క్యాంపెయిన్ మొదలైంది. దేశ బొగ్గు ఉత్పత్తిలో రెండు శాతం కంటే తక్కువ ఉత్పత్తి చేసినప్పటికీ, పర్యావరణ కార్యకర్తల నుండి ఈ ప్రాంతంలో వెయ్యికంటే అధిక నిరసనలను అదాని ఎదుర్కొంది. ఆస్ట్రేలియాలో మరే ఇతర సంస్థ ఇంత వ్యతిరేకతను ఎదుర్కోలేదు.

2014లో న్యూ సౌత్ వేల్స్ చీఫ్‌గా మైక్ బైర్డ్ ఉన్నప్పుడు- ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు నౌకాశ్రయం అయిన న్యూ క్యాజిల్ పోర్ట్‌ను ఆస్ట్రేలియన్ ప్రభుత్వం 1.75 బిలియన్లకు 98 సంవత్సరాల పాటు చైనా మద్దతు ఇచ్చిన కన్సార్టియంకు అప్పగించింది. 2015లో బైర్డ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు వివిధ నివేదికలు స్పష్టం చేశాయి.

2015లో- 506 మిలియన్ల డాలర్లకు 99 సంవత్సరాల లీజు ఒప్పందంతో ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీలోని డార్విన్ పోర్ట్‌ను చైనా కొనుగోలు చేసింది.

చైనాను ఎదుర్కోవడానికి మనీలాలో 2017 ఆసియా శిఖరాగ్ర సమావేశాల సమయంలో అప్పటి జపాన్ ప్రధానమంత్రి షింజో అబే, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. క్వాడ్‌ను పునరుద్ధరించడానికి అంగీకరించారు.

Adani and china

దౌత్యపరంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో.. ప్రత్యేకించి- దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనాను ఎదుర్కొనాల్సిన అవసరం ఉందని భావించాయి క్వాడ్ సభ్య దేశాలు. క్వాడ్‌ దేశాలతో చైనా మధ్య ఉన్న ఉద్రిక్తతలు ఈ రీజియన్‌లో కొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీయవచ్చనే వ్యాఖ్యలు వినిపించాయి అప్పట్లో.

2018లో దక్షిణ సముద్రంపై చెలరేగిన వివాదం నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం, యూనివర్శిటీలు, మీడియాలో ఆందోళన వ్యక్తమైంది. వివిధ రంగాలలో చైనా రాజకీయ ప్రభావం పెరగడం వల్ల ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడం మొదలుపెట్టాయి.

2020- ఆస్ట్రేలియన్ బొగ్గుపై అనధికారిక నిషేధం విధించింది చైనా. కెనడా నుండి బొగ్గును కొనుగోలు చేయడం ప్రారంభించింది. 2023లో చైనా అనధికారిక నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ.. రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి.

2. శ్రీలంకలో..

ఆగష్టు 2011: శ్రీలంకలోని సదరన్ టెర్మినల్‌గా పిలువబడే కొలొంబో ఇంటర్నేషనల్ కంటైనర్ టర్మినల్ నిర్వహణ కోసం 2011లో 35 ఏళ్ల పాటు కన్సెషన్ అగ్రిమెంట్‌ను శ్రీలంక పోర్టు అథారిటీతో చైనా మర్చంట్ పోర్ట్స్ కుదుర్చుకుంది. హిందూ మహా సముద్రంలో ఈ పోర్టు చాలా కీలకం.చైనా పెట్టుబడులు పెట్టడం, కొలొంబో పోర్టును విస్తరించడంతో శ్రీలంక పోర్టు ఇండస్ట్రీ గణనీయంగా పెరిగింది.ఈ ఓడరేవు ఇప్పుడు భారతదేశ ట్రాన్స్‌షిప్‌మెంట్ కార్గోలో 50శాతంకు పైగా నియంత్రిస్తుంది.

ఆగష్టు 2015: చైనాను కౌంటర్ చేసేందుకు పావులు కదిపిన అదానీ కేరళ ప్రభుత్వంలో ఒక కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.విజింజామ్ ఇంటర్నేషనల్ సీపోర్టు‌ను అభివృద్ధి చేసి ఆపరేట్ చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఇది మొత్తం ట్రాన్షిప్‌మెంట్ కార్గో కోసమే అంకితం చేశారు.అయితే ఈ పోర్టు పై స్థానిక చర్చిల నుంచి, మత్స్యకారుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. సముద్రం తీరం కొట్టుకుపోతోందనే ఆందోళన వారంతా వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుతో పర్యావరణానికి జరిగే నష్టం గురించి సమీక్షిస్తున్న జాతీయ హరిత ట్రైబ్యునల్ కూడా ఎలాంటి అడ్డు చెప్పలేదు.అయితే నవంబర్ 2022లో లాటిన్ చర్చ్ బోర్డు సభ్యుల బ్యాంకు ఖాతాల్లో విదేశీ నిధులు అందడంతో పోర్టును అడ్డుకునేందుకు ఎవరో కావాలనే కుట్రపన్నారనేది తేటతెల్లమైంది.ఇక ఈ ప్రాజెక్టు పూర్తవడంతో దీని క్రెడిట్ కోసం ఇటు ఎల్‌డీఎఫ్, అటు యూడీఎఫ్‌లో పోటీపడుతున్నాయి.

సెప్టెంబర్ 2017: చైనా మర్చంట్ పోర్టు హంబన్‌తోట పోర్టును 99 ఏళ్లపాటు లీజుకు తీసుకుంది. అయితే దాన్ని వివాదాలు చుట్టుముట్టాయి.హిందూ మహాసముద్రంలో తన నేవల్ ఆపరేషన్స్‌ను నిర్వహించేందుకు శ్రీలంకలోని హంబన్‌తోట పోర్టుపై చైనా కన్నేసింది.ఇక భారత్‌పై కాలు దువ్వేందుకు తన అవసరాల కోసం శ్రీలంక భూభాగాన్ని వినియోగించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం శ్రీలంకకు సాంకేతికంగాను ఆర్థింగాను సాయం చేసింది చైనా.

సెప్టెంబర్ 2021: శ్రీలంకలోని పోర్టు ఇండస్ట్రీలో అదానీ ఎంటర్ అయ్యారు. ఇక్కడ ఆన 700 మిలియన్ అమెరికన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టారు.ఇవన్నీ కొలొంబో పోర్టు టెర్మినల్‌లో పెట్టి భారత్ ఎంట్రీని ఖరారు చేస్తూ చైనాకు గట్టి షాక్ ఇచ్చారు.ఒక్క అదానీ తప్ప ఇతర భారత కంపెనీలు ఏవీ కూడా శ్రీలంకలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రాలేదు.

ఫిబ్రవరి 2023- వాయు విద్యుత్ ప్రాజెక్టుల్లో 450 మిలియన్ అమెరికన్ డాలర్లు పట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన అదానీకి శ్రీలంక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నవంబర్ 2023- అదానీ ఫైనాన్స్‌, అదానీ కొలొంబొ టెర్మినల్‌ల అమెరికా ప్రభుత్వం మద్దతుగా నిలిచిన డీఎఫ్‌సీ అనే ఇన్స్‌టిట్యూట్ 553 మిలియన్ అమెరికా డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. అయితే దీన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేసింది హిండెన్‌బర్గ్ రిపోర్టు.

ఫిబ్రవరి 2024: పర్యావరణవేత్తల నంచి అదానీ భారీగా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు.

జూన్ 2024: అదానీ చేపట్టిన పవర్ ప్రాజెక్టుల నిర్మాణంతో పర్యావరణం దెబ్బ తింటోందంటూ ఆయనకు వ్యతిరేకంగా తొలిసారిగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.అంతేకాదు అదానీకి ఏ లెక్క ప్రకారం ప్రాజెక్టులు కేటాయిస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమైంది.

3.ఇజ్రాయెల్‌లో..

జనవరి 2023 - హైఫా పోర్ట్: ఇజ్రాయెల్‌కు చెందిన హైఫా పోర్టును కొనుగోలు చేసే విషయంలో చైనాను అధిగమించింది అదాని. నిజానికి సూయెజ్ కాలువ అత్యంత సమీపంలో ఉండటం వల్ల ఇజ్రాయెల్ అత్యంత వ్యూహాత్మక ప్రదేశం. తూర్పు- పశ్చిమ మధ్య తీరానికి లింక్ కావడం వల్ల హైఫా పోర్టును కొనుగోలు చేయడం అటు భారత్‌కు, ఇటు అదానికీ పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్‌లో చైనాకు ఇప్పటికే రెండు పోర్టులు ఉండటం గమనార్హం.

చైనా షాంఘై ఇంటర్నేషనల్ పోర్ట్ గ్రూప్ ఈ హైఫా బేను నిర్మించింది. 25 సంవత్సరాల నిర్వహణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైఫా పోర్టు, హైఫా బేలోనూ అదాని తన కార్యకలాపాలు కొనసాగిస్తుంది. హైఫా బే పోర్ట్ టెర్మినల్ సెప్టెంబర్ 2021లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఒక చైనీస్ కంపెనీ కూడా ఇజ్రాయెల్‌లోని అష్డోడ్ పోర్ట్‌లో కార్గో టెర్మినల్‌ను నిర్వహిస్తోన్నప్పటికీ- హైఫా తరహాలో క్రియాశీలకంగా ఉండట్లేదు.

జనవరి 2023 - అదానీపై హిండెన్‌బర్గ్ నివేదిక: షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ద్వారా చైనీస్ లింక్‌లు ఉన్న వ్యాపారవేత్త నివేదికను అప్పగించారంటూ ఈ నివేదిక పేర్కొంది. ఫలితంగా 2023 జనవరిలో అదానీ గ్రూప్ షేర్లు గణనీయంగా పడిపోయాయని మహేష్ జెఠ్మలానీ ఆరోపించారు.

అదానీపై నివేదికను రూపొందించడానికి చైనా గూఢచారి అన్లా చెంగ్, ఆమె భర్త మార్క్ కింగ్డన్.. హిండెన్‌బర్గ్‌ను నియమించుకున్నారని జెఠ్మలానీ పేర్కొన్నారు. అదానీ షేర్లను షార్ట్ సెల్లింగ్ చేయడానికి, చైనా ప్రయోజనాల కోసం వారు కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ (KMIL)ను ఉపయోగించారు.

బిజినెస్, డిజిటల్ న్యూస్, ఈవెంట్‌ ప్లాట్‌ఫామ్ సుప్‌చైనా (SupChina)ను 2016లో స్థాపించారు అన్లా చెంగ్. దీని ద్వారా పాశ్చాత్య దేశాలకు చెందిన రీడర్లను ఆకర్షించాలనేది వ్యూహం. 2022లో అమెరికా-చైనా సంబంధాలు క్షీణించినప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దీనికి చైనా ప్రాజెక్ట్‌గా పేరు మార్చారు.

చైనా వార్తలు, సొసైటీ-థీమ్ సినికా పాడ్‌కాస్ట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ డేటా ప్రొడక్ట్ చైనా ఎడ్జ్ (ChinaEDGE) ఉన్నాయి. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ, దాని అనుబంధ విభాగాలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు చెంగ్ మీడియా వెంచర్‌పై ఉన్నాయి.

Adani

4.టాంజానియా/ఆఫ్రికా:

మే 2024: చైనా సంస్థ హచిన్‌సన్ పోర్ట్ హోల్డింగ్స్‌‌కు చెందిన దార్ ఎస్ సలామ్‌ ప్రాజెక్టును చేజిక్కించుకోవడం ద్వారా అదానీ ఆఫ్రికాలో అడుగుపెట్టారు. చైనా ఆధిపత్యం చెలాయించడాన్ని సహించలేకపోయిన టాంజానియా ప్రభుత్వం డ్రాగన్ కంట్రీకి గుడ్‌బై చెప్పేసింది.దీంతో అదానీ వైపు చూసి ఆ ప్రాజెక్టును తనకు అప్పగించింది.

ఆఫ్రికాలో అప్పటికే పాతుకుపోయిన చైనా, తన ఆధిపత్యాన్ని చాటుతున్న వేళ అదానీకి ప్రాజెక్టును అప్పగించడంతో భారత్‌కు కీలకంగా మారింది.ఒకవేళ చైనా అలానే కొనసాగి ఉండి ఉంటే పాశ్చాత్య ప్రపంచంతో భారతదేశ వాణిజ్యంకు బ్రేక్ పడేది.ఎర్ర సముద్రం ఎంట్రీ వద్ద చైనా వ్యూహాత్మకంగా నావికా స్థావరాన్ని జిబౌటీలో ఏర్పాటు చేసింది. దీంతో తొలి విదేశీ నావికా స్థావరాన్ని చైనా ఏర్పాటు చేసింది.చైనా ఫిబ్రవరి 2016లో జిబౌటిలో ఈ స్థావరాన్ని నిర్మించడం ప్రారంభించింది, ఇక్కడ కేవలం 8 లక్షల మంది మాత్రమే నివసిస్తున్నారు.జిబౌటీలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడంలో చైనా బ్యాంకులు ప్రధాన పాత్ర పోషించాయి.20 బిలియన్ డాలర్లు మేరా ఈ బ్యాంకులు నిధులు సమకూర్చాయి. రైలు మార్గం, రోడ్లు ఓడరేవు అభివృద్ధితో సహా జిబౌటి ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం చైనా చెల్లించిన ఆర్థిక పెట్టుబడులు... అమెరికా యూరోపియన్ యూనియన్ కలిపి తీసుకున్న రుణాల చెల్లించాల్సిన మొత్తం కంటే చాలా ఎక్కువ.

దీన్ని అధిగమించేందుకు అదే సమయంలో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌ను సవాలు చేసేలా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI), ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ (IMEEC)ను తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఆసియా, పెర్షియన్ గల్ఫ్, యూరప్ మధ్య కనెక్టివిటీ ఆర్థిక ఏకీకరణను జరుగుతుంది. ఇందుకోసం 2023 సెప్టెంబర్ 10వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు వేదికగా అమెరికా, యూఏఈ,సౌదీ అరేబియా,ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జోర్డాన్ ఇంకా యూరోపియన్ యూనియన్‌ ప్రభుత్వాలతో అవగాహన ఒప్పందం(MoU) భారత్ కుదుర్చుకుంది.భారత్ నుంచి యూరోప్‌కు యూఏఈ,సౌదీ, ఇజ్రాయిల్, గ్రీస్ మీదుగా వెళ్లే రూటును ప్రతిపాదించడం జరిగింది.మరోవైపు చైనాకు కెన్యా, సూడాన్, ఈజిప్టుల్లో కూడా పోర్టులు ఉన్నాయి.

5. మియన్మార్‌లో..

మే 2019:యాంగాన్ ప్రాంతంలో నూతన కంటెయినర్ టెర్మినల్ నిర్మించి ఆపరేట్ చేసేందుకుగాను 290 మిలియన్ అమెరికన్ డాలర్లను పెట్టుబడిగా పెడుతున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది.అక్కడి మిలటరీకి చెందిన భూముల్లో పోర్టు నిర్మాణం చేపట్టాల్సి ఉండగా.. అంతర్గత రాజకీయాలు వేడెక్కడం,సైనిక తిరుగుబాటుతో ఈ ప్రాజెక్టు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది.అసంబద్ధమైన 'మానవ హక్కుల' ఉల్లంఘన ఆరోపణలు రావడంతో అదానీ గ్రూప్ 2023 మే నెలలో పోర్టును విక్రయించాలని నిర్ణయించుకుంది.

డిసెంబర్ 2023: గత కొంత కాలంగా జాప్యానికి గురవుతున్న క్యాఫ్యూ పోర్టు నిర్మాణ బాధ్యతలను మియన్మార్ ప్రభుత్వం చైనాకు అప్పగించింది.2010లో నిర్మించేందుకు ప్రణాళిక జరిగింది. దీంతో మిలటరీ పరంగా భారత్‌పై చైనాకు కాస్త ఆధిపత్యం లభించినట్లయ్యింది. ఎందుకంటే భారతదేశానికి తూర్పున ఉన్న మియన్మార్,దక్షిణాన శ్రీలంకలోని హంబన్‌తోట,పశ్చిమంలో పాకిస్తాన్‌లోని గ్వదార్‌తో పాటు జిబౌటీలోని పూర్తిస్థాయిలో నావికా స్థావరాలు చైనాకు ఉన్నాయి.

మియన్మార్‌లో మైనార్టీలుగా ఉన్న రోహింగ్యాలను తొలగించే మిలటరీ ప్రక్రియలో క్యాఫ్యూ పేరు బాగా వినిపించింది.చాలా కాలంగా వివక్షకు గురైన తన సొంత ముస్లిం మైనారిటీలపై తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా, రోహింగ్యా శరణార్థులను మయన్మార్‌లోని నిర్బంధ శిబిరాలకు తిరిగి పంపుతోంది. కానీ మానవ హక్కుల ఉల్లంఘనతో సహా ఎలాంటి నైతిక చర్యలను చైనా ఎదుర్కోలేదు.

6.బంగ్లాదేశ్‌లో..

మార్చి 2010: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో లోతైన ఓడరేవును నిర్మించేందుకు చైనా ముందుకొచ్చింది.

ఆగష్టు 2015: భారత పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌లో చైనా ఆధిపత్యం ఎక్కువ అవుతుండటంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా 1600 మెగా వాట్ల గొడ్డ పవర్ ప్లాంట్‌ను అదాని గ్రూప్ ప్రతిపాదించింది.అయితే ఈ పవర్ ప్లాంట్ నిర్మాణంపై ఇటు భారత్‌లో అటు బంగ్లాదేశ్‌లో సామాజిక కార్యకర్తలు, ఎన్జీఓల నేతృత్వంలో పలు నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే వీటన్నిటినీ దాటుకుని 2023లో ఈ విద్యుత్ ప్లాంట్‌ ప్రారంభమైంది.

అక్టోబర్ 2016:చైనా బంగ్లాదేశ్‌తో 26 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.దీని ద్వారా బంగ్లాదేశ్‌ను అధికారికంగా దాని ప్రధాన అంతర్జాతీయ మౌలిక సదుపాయాల కార్యక్రమం, BRI (బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్)లో భాగం చేసింది.

డిసెంబర్ 2020,మే 2021: చైనాకు చెందిన 2640 మెగా వాట్ల పేరా పవర్ ప్లాంట్ బంగ్లాదేశ్‌లోనే అతిపెద్ద పవర్ ప్లాంట్‌గా గుర్తింపు పొందింది. 2023లో యూనిట్ కరెంటును 18.37 టాకాలకు చైనా అమ్మింది.మరోవైపు అదానీ గ్రూప్‌కు చెందిన గొడ్డ పవర్ ప్లాంట్ యూనిట్ కరెంట్‌ను చైనా కంటే సగం ధరకే అంటే 9.09 టాకాకే అదే ఏడాది విక్రయించింది.

7. ఇరాన్ పాకిస్తాన్‌లో...

మే 2015 - చాబహార్ పోర్టు, ఇరాన్: ప్రధాని నరేంద్ర మోదీ 2016 మే 23న ఇరాన్ పర్యటనకు వెళ్లినప్పుడు చాబహార్ పోర్టును అభివృద్ధి చేసే దిశగా అవగాహన ఒప్పందం భారత్ ఇరాన్ దేశాల మధ్య జరిగింది. చైనా పాకిస్తాన్‌కు మిత్రదేశంగా మారడం, బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్‌పై పెద్ద ఎత్తున ప్రచారంకు కౌంటర్‌గా భారత్‌కు ఇరాన్ ఈ భారీ ప్రాజెక్టును అప్పగించింది.ఈ ప్రాజెక్టు ద్వారా పాకిస్తాన్‌ను నిలువరించి,చైనాకు అడ్డుకట్ట వేయడం జరిగింది. అంతేకాదు యూరోప్‌తో పాటు ఇతర ఆసియా దేశాలకు వెళ్లాలంటే పాకిస్తాన్ గుండా వెళ్లవలసి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా యూరప్‌తో ఇరాన్ ద్వారా మంచి కనెక్టివిటీ చాబహార్ పోర్టు ద్వారా కుదిరింది .

పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్ ప్రాంతంలో గ్వదార్ పోర్టు అభివృద్ధికి చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇది చాబహార్ పోర్టుకు కాస్త దగ్గరగా ఉంటుంది.బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో భాగంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌ నిర్మాణానికి డ్రాగన్ కంట్రీ మార్గం సుగుమం చేసింది.

దక్షిణాసియాలోని ఈ మూడు పోర్టులు- బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్, శ్రీలంకలోని హంబన్‌తోట, పాకిస్తాన్‌లోని గ్వదార్ పోర్టులు భారత్‌కు చుట్టూ ఉన్నాయి. వీటినే ట్రయాంగిల్ ఆఫ్ డెత్‌గా పిలుస్తారు.

2021 ఆగష్టు 19 నాటికి హిందూ మహాసముద్రం ప్రాంతంలో చైనా మూడు పోర్టుల్లో పెట్టుబడులు పెట్టగా.. ఇక అప్పటి నుంచి అదానీ డ్రాగన్ కంట్రీ వెన్ను విరిచేలా చైనాకే చెందిన దార్ ఎస్ సలామ్ పోర్టును చేజిక్కించుకున్నారు.

మొత్తానికి అదానీని, ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని టార్గెట చేస్తూ, ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఒక నెట్‌వర్క్ పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఎవరు ఇదంతా చేస్తున్నారు, అదానీకి వ్యతిరేకంగా పనిచేయాలంటూ పురమాయిస్తూ ఎవరు నిధులు సమకూరుస్తున్నారనేది త్వరలోనే బయటకు వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+