అమ్మ పనిమనిషి... కొడుకు 400 లగ్జరీ కార్ల యజమాని!
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. అనే పాట వినే ఉంటాం. దానిని చాలా మంది నిరూపించి చూపించారు కూడా. అదే కోవలోకి వస్తారు బెంగళూరుకు చెందిన రమేశ్ బాబు. ఆయన పట్టుదల పారిశ్రామిక దృష్టికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఒకప్పుడు రోడ్డు పక్కన కటింగ్ షాప్ నడుపుకున్న ఆయన.. నేడు దాదాపు 400కు పైగా లగ్జరీ కార్లకు యజమాని. పేదరికం, కష్టాల నుంచి ప్రపంచ స్థాయి లగ్జరీ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారానికి ఎదిగిన ఆయన ప్రయాణం ఆశ్చర్యకరం. రమేశ్ బాబు ఇటీవల దాదాపు రూ.3 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 కారును కొనుగోలు చేశారు. ఆయన గ్యారేజీలో ఇప్పటికే రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెర్సిడెజ్-బెంజ్ ఈ-క్లాస్ సెడాన్, మెర్సిడెజ్-మేబ్యాక్ ఎస్600 వంటి అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి.
సామాన్య కుటుంబ నేపథ్యం.. చిన్ననాటి కష్టాలు
రమేశ్ బాబు జీవితం కష్టాలతోనే ప్రారంభమైంది. ఆయ తండ్రి కూడా బార్బర్‌గా పనిచేసేవారు. రమేశ్ కు ఏడేళ్ల వయసులోనే తండ్రి మరణించారు. దాంతో కుటుంబానికి ఆధారం లేకుండా పోయింది. రమేశ్‌ను, ఆయన సోదరులను పోషించడానికి ఆయన తల్లి ఇతరుల ఇళ్లలో పాత్రలు కడగడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులు చేసి కుటుంబానని పోషించింది. ప్రాథమిక అవసరాలు తీరడానికి ఆమె తెల్లవారుజాము నుంచీ అర్ధరాత్రి వరకూ కష్టపడేవారు. అయితే ఆర్థిక ఇబ్బందులున్నా రమేశ్ తన చదువును ఆపలేదు. చదువుకుంటూనే తల్లికి సాయం చేయాలనే ఉద్దేశంతో పేపర్లు వేయడం, పాలు అమ్మడం వంటి చిన్నచిన్న పనులు చేశారు. పార్ట్-టైం వర్క్ చేస్తూనే స్కూల్ కు వెళ్లి తిరిగి వచ్చి చదువుకునేవారు.

బార్బర్ షాప్ నుంచి ట్రావెల్స్ వ్యాపారం వరకు..
పాఠశాల విద్య పూర్తయ్యాక రమేశ్ తండ్రిలాగే బార్బర్ వృత్తిని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ముందుగా రోడ్డు పక్కనే కటింగ్ షాపును ప్రారంభించారు. ఆ తర్వాత అద్దెకు ఓ చిన్న షాప్ తీసుకుని బార్బర్ షాప్ ను మెల్లగా సెలూన్‌గా.. ఆపై ప్రతిష్టాత్మక స్టైలింగ్ అవుట్‌లెట్‌గా మార్చారు. ఈ సెలూనే ఆయన భవిష్యత్తు వ్యాపారాలకు పునాది వేసింది. సెలూన్ ద్వారా వచ్చిన పొదుపుతో 1993లో రమేశ్ ఓ మారుతి ఓమ్ని వ్యాన్ ను కొన్నారు. ఆ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉండే ఆ వ్యాన్ ను అద్దెకు ఇవ్వడం ప్రారంభించారు. తెలియకుండానే ఆయన వేసిన ఈ అడుగే ఆయనకు పెద్ద వ్యాపార భవిష్యత్తును నిర్ణయించింది.
లగ్జరీ కార్ల ఫ్లీట్ అధినేతగా..
రమేశ్ బాబు లగ్జరీ కార్ల వ్యాపారంలోకి ప్రవేశం 2004లో జరిగింది. రమేశ్ 2004లో ఓ మెర్సిడెజ్-బెంజ్ ఈ-క్లాస్ కారును కొనుగోలు చేశారు. ఈ కారుతోనే ఆయన 'రమేశ్ టూర్స్ అండ్ ట్రావెల్స్' అనే ప్రీమియం కారు అద్దె సంస్థను ప్రారంభించారు. కొద్ది సంవత్సరాల్లోనే ఆయన తన కార్ల ఫీట్ ను విస్తరిస్తూ పోయారు. రోల్స్-రాయిస్ ఘోస్ట్, మర్సిడెజ్-మేబ్యాక్ S600, బీఎండబ్ల్యూ i7 వంటి దేశంలో అత్యంత ఖరీదైన, ప్రతిష్టాత్మకమైన కార్లను చేర్చారు.
నేడు రమేశ్ బాబుకు 400కు పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటిలో మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ, జాగ్వార్, రోల్స్-రాయిస్ వంటి హై-ఎండ్ బ్రాండ్లు ఉన్నాయి. కార్పొరేట్ ప్రయాణాలు, ప్రత్యేక సందర్భాలు, ప్రీమియం సేవల కోసం అగ్రశ్రేణి వాహనాలను అందించడంలో రమేశ్ బాబు సంస్థ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. రోడ్డు పక్కన బార్బర్‌గా జీవితం ప్రారంభించిన రమేశ్ బాబు... నేడు భారతదేశంలోనే అత్యంత విలాసవంతమైన ట్యాక్సీ సర్వీసు యజమానిగా నిలవడం యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications