Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పుస్తకాల పురుగు ఉగ్రవాదిగా ఎలా మారాడు? ఢిల్లీ పేలుడు నిందితుడి కుటుంబం దిగ్భ్రాంతి!

Delhi Car Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న డాక్టర్ మహమ్మద్ ఉమర్ కుటుంబం మాత్రం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అత్యంత ప్రతిభావంతుడు, చదువు తప్ప మరో ధ్యాస లేని తమ బిడ్డ ఉగ్రవాద కార్యకలాపాల్లో ఎలా పాల్గొన్నాడనేది వారికి అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.

పేదరికం నుంచి గట్టెక్కే ఆశాదీపం
పుల్వామాలోని కోయిల్ గ్రామానికి చెందిన డాక్టర్ ఉమర్ ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం, ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. పేలుడు ఘటన, ఉమర్ ఉగ్ర లింక్ వార్తలపై ఆయన వదిన మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహమ్మద్ ఉమర్ ఎక్కువ సమయం చదువుకు మాత్రమే కేటాయించేవాడని, అతను ఇంటికి వచ్చినప్పుడల్లా తమను కూడా చదువుకోమని ప్రోత్సహించేవాడని ఆమె తెలిపారు. "గత శుక్రవారం నేను అతనితో మాట్లాడినప్పుడు కూడా పరీక్షల గురించి, లైబ్రరీలో చదువుతున్నట్లు చెప్పాడు. అలాంటి వ్యక్తి ఈ ఉగ్రవాద దాడిలో ఉన్నాడని తెలియగానే మేము షాక్‌కు గురయ్యాం" అని కన్నీళ్లు పెట్టుకున్నారు.

From Bookworm to Terror Suspect The Shocking Story of Delhi Blast Accused Dr Mohammad Umar

పేదరికంతో పోరాడుతున్న తమ కుటుంబానికి డాక్టర్ ఉమర్ ఏకైక ఆశాదీపం అని, అతని తల్లి కష్టపడి పని చేసి తమ కుటుంబాన్ని పోషించిందని ఆమె పేర్కొన్నారు. తమ భవిష్యత్తుకు భరోసాగా ఉన్న ఉమర్ అరెస్టు లేదా మృతి తమ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసిందని వాపోయారు. డాక్టర్ ఉమర్ పేరు పేలుడు కేసులో తెరపైకి రావడంతో, పోలీసులు వెంటనే అతని ఇద్దరు సోదరులు - ఆషిక్ అహ్మద్, జాహూర్ అహ్మద్, వారి తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్: డాక్టర్ ఉమర్ ఫరీదాబాద్‌లో ఇటీవల భగ్నం చేయబడిన ఉగ్రవాద మాడ్యూల్‌లో సభ్యుడిగా ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇది జైష్-ఎ-మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్‌తో సంబంధం కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు. డాక్టర్ ఉమర్‌కు సన్నిహితుడైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ కార్యాలయంలో దాడులు జరిపి భారీగా దాదాపు 2,900 కిలోల ఐఈడీ తయారీ ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు.

భయంతోనే పేలుడు?
డాక్టర్ షకీల్ అరెస్టు, ఐఈడీ ముడిసరుకు పట్టివేత వంటి సంఘటనలతో తాను కూడా పట్టుబడతానని డాక్టర్ ఉమర్ కంగారుపడి ఈ ఆత్మాహుతి తరహా దాడికి పాల్పడి ఉండవచ్చని దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎర్రకోట వద్ద పేలిపోయిన హ్యుందాయ్ ఐ20 కారులో ఉమర్ ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ పేలుడులో అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ (ANFO) వంటి అత్యంత మండే మిశ్రమాన్ని ఉపయోగించినట్లు తేలింది. ఈ దాడిలో 9 మంది మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు.

ఒకవైపు ఉగ్రదాడి కుట్ర కోణాలు దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాలు విసురుతుండగా.. మరోవైపు ఉన్నత విద్యను అభ్యసించి, కుటుంబానికి ఆసరాగా నిలబడాల్సిన ఒక యువకుడు ఉగ్రవాదంలోకి ఎలా వెళ్లాడనే ప్రశ్న ఈ మొత్తం కేసులో కీలకంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+