టీఆర్ఎస్ పై కేంద్రం దాడి ముమ్మరం-మధ్యలో వైసీపీని వదలని వైనం ! మోడీ ఇస్తున్న సంకేతమిదే !

తెలంగాణలో బీజేపీపై కేసీఆర్ సాగిస్తున్న పోరు ప్రభావం ఆయన సొంత పార్టీ టీఆర్ఎస్ తో పాటు పొరుగురాష్ట్రమైన ఏపీలో అధికార పార్టీ వైసీపీ నేతలకూ తాకుతోందా ? టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ కేంద్రం దర్యాప్తు సంస్ధల్ని ప్రయోగిస్తున్న తీరు ఇప్పుడు గులాబీ నేతలతో పాటు వైసీపీ నేతలకూ చికాకు పెడుతోందా ? తాజాగా లిక్కర్ స్కాంతో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు రియల్ ఎస్టేట్ వరకూ వచ్చేసింది. దీంతో హైదరాబాద్ కేంద్రంగా ఇన్నాళ్లూ సేఫ్ గా వ్యాపారాలు చేసుకుంటున్న ఏపీ నేతలు ఇరుకునపడుతున్నారు.

కేసీఆర్ వర్సెస్ బీజేపీ పోరు

కేసీఆర్ వర్సెస్ బీజేపీ పోరు

తెలంగాణలో బీజేపీ వర్సెస్ కేసీఆర్ రాజకీయం అంతకంతకూ ముదురుతోంది. ఇప్పటికే ఇటు కేసీఆర్, అటు బీజేపీ వరుస ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయి. వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న తెలంగాణలో ఇప్పటి నుంచే ఆధిక్యం అందుకునేందుకు ఇరు పార్టీలు శ్రమిస్తున్నాయి. ఈ పోరులో ఒక్కోసారి ఒక్కొక్కరు పైచేయి సాధిస్తుండగా.. వారి ప్రత్యర్ధులు దెబ్బతింటున్నారు. తాజాగా ఈ రాజకీయంలో భాగంగా మునుగోడు ఉపఎన్నికను జనంపైకి రుద్దిన బీజేపీ...అక్కడ టీఆర్ఎస్ గెలుపుతో ఘోరంగా దెబ్బతింది. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీకి సన్నిహితులైన స్వాములు సాగించిన బేరసారాల్ని పోలీసుల సాయంతో పట్టుకున్న టీఆర్ఎస్.. వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టలేకపోయింది. అదే అదనుగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుమార్తె కవితతో పాటు ఆ పార్టీకి సన్నిహితంగా ఉంటున్న పలువురిని కేంద్రం దర్యాప్తు సంస్ధల సాయంతో టార్గెట్ చేస్తోంది. దీంతో ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారిపోయింది.

 కేంద్ర దర్యాప్తు సంస్ధల దాడులు

కేంద్ర దర్యాప్తు సంస్ధల దాడులు

కేసీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో టీఆర్ఎస్ నేతల చుట్టూ ఉన్నవారి ఆర్ధిక మూలాల్ని దెబ్బకొట్టేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో ఇన్నాళ్లు టీఆర్ఎస్ కు ఆర్ధికంగా అండదండలు అందించిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాఫియాతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కాం సిండికేట్లను కేంద్రం కదిపింది. వీరిపై కేంద్ర దర్యాప్తు సంస్ధలైన సీబీఐ, ఈడీతో పాటు ఐటీని కూడా ప్రయోగిస్తోంది. ఆయా సంస్ధలు వరుస దాడులతో లిక్కర్ స్కాం, రియల్ ఎస్టేట్ అక్రమాలన్నీ బయటికి వస్తున్నాయి. ఇందులో టీఆర్ఎస్ నేతల పాత్ర బయటపడుతుండటంతో ఆ పార్టీ ఇరుకునపడుతోంది.

వైసీపీ నేతలు, సన్నిహితులపైనా ?

వైసీపీ నేతలు, సన్నిహితులపైనా ?

టీఆర్ఎస్ లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్ధల్ని ప్రయోగిస్తున్న కేంద్రం ఇప్పుడు వారితో కుమ్మక్కు కావడమో లేక లావాదేవీలు, సంబంధాలు నెరుపుతున్న వైసీపీ నేతల్ని సైతం వదిలిపెట్టడం లేదు. జగన్ తో కేంద్రం సత్సంబంధాలు నెరుపుతున్నా ఈ నేతల విషయంలో మాత్రం రాజీపడటం లేదు. దీంతో లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కుమారుడు రాఘవరెడ్డి పేర్లు బయటికి వచ్చాయి. అలాగే ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడైన శరత్ చంద్రారెడ్డి, ఆయన భార్య పేర్లు కూడా వచ్చాయి.. అలాగే ఇవాళ వంశీరామ్ బిల్డర్స్ పై ఐటీ దాడులు విజయవాడలోని వైసీపీ నేతలు దేవినేని అవినాష్, వల్లభనేని వంశీకి కూడా చుట్టుకున్నాయి.
దీంతో వైసీపీ నేతలు బెంబేలెత్తుతున్నారు.

 మోడీ ఇస్తున్న సంకేతమిదేనా ?

మోడీ ఇస్తున్న సంకేతమిదేనా ?

తెలంగాణలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీని అడ్డుకునేందుకు కేసీఆర్ ఎదురుదాడి మార్గం ఎంచుకోవడంతో ఇప్పుడు టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్న కేంద్రం.. ఆ పార్టీ నేతలు, వారి సన్నిహితులతో అంటకాగుతున్న వైసీపీ నేతల్నీ వదిలిపెట్టడం లేదు. దీంతో ప్రధాని మోడీ ఇస్తున్న సంకేతాలపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ సాగుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా వెళితే పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై కేసీఆర్ తో పాటు జగన్ కూ ముందస్తు హెచ్చరికలు పంపేందుకే మోడీ ఎవరినీ లెక్కచేయకుండా ఈ దాడులు చేయిస్తున్నారన్న చర్చ సాగుతోంది. రాబోయే రోజుల్లో ఏపీలో పరిస్ధితులు మారిపోయి వైసీపీ సైతం బీజేపీకి వ్యతిరేకంగా మారితే ఏం జరుగుతుందన్న దానిపై ఇదో ట్రైలర్ గా చూపించేందుకు మోడీ ప్రయత్నిస్తున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+