సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసిన అదే కంపెనీకి ఇప్పుడు..
కష్టే ఫలి అన్నారు పెద్దలు. ఈ మాటలను అక్షరాల నిజం చేసి చూపించాడు ఈ యువకుడు. కేవలం టెన్త్ క్లాస్ వరకే చదివి.. ఇప్పుడు ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. తమిళనాడుకు చెందిన అహ్మద్ అలిమ్ సక్సెస్ జర్నీ యువతకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఎలాంటి డిగ్రీలు లేకుండా, చదువు లేకపోయినా పట్టుదల, కష్టపడే తత్వంతో సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజినీర్ గా ఎదిగాడు. సెక్యూరిటీ గార్డుగా పని చేసిన కంపెనీలో ఇప్పుడు ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. ప్రస్తుతం అహ్మద్ అలిమ్ సక్సెస్ జర్నీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
తమిళనాడుకు చెందిన అహ్మద్ అలిమ్ తాజాగా లింక్ డిన్ లో తన ఎమోషనల్ జర్నీ గురించి పోస్టు చేశాడు. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఒకప్పుడు కంపెనీకి గార్డుగా పనిచేసిన అతను ఇప్పుడు అదే కంపెనీలో ఉన్నత స్థాయికి చేరుకోవడం అందరికీ స్ఫూర్తిని కలిగిస్తోంది. ఈ పోస్టులో 2013 నుంచి జీవితంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాలు, సవాళ్లను వివరించాడు.
" 2013..ఆ సమయంలో నా దగ్గర రూ. 1000 మాత్రమే ఉన్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు అందులో రూ. 800 ట్రైన్ టికెట్ కు ఖర్చు అయింది. ఆ తర్వాత 2 నెలలు రూడ్లపై తిరిగాను. ఫైనల్ గా సెక్యూరిటీ గార్డుగా చేరాను. ఓ రోజు ఆ కంపెనీలోని సీనియర్ అధికారి నా వివరాలు అడిగారు. నేను చెప్పాను. నా స్టడీస్ గురించి అడిగారు. స్కూల్ డేస్ లో HTML నేర్చుకున్నానని చెప్పాను. అలా చిన్నగా ఈ కోర్సు గురించి నేర్చుకున్నాను. రోజూ 12 గంటలపాటు సెక్యూరిటీగా పనిచేసి ఆ తర్వాత సీనియర్ వద్దకు వెళ్లి నేర్చుకున్నాను. అలా 8 నెలల తర్వాత ఓ చిన్న యాప్ రూపొందించాను. ఆ యాప్ వివరాలను సీనియర్ ఉద్యోగికి చూపించాను. అతడు మేనేజర్ వద్దకు తీసుకెళ్లాడు. ఆయనకు నా యాప్ నచ్చింది. అవకాశం ఉంటే యాప్ గురించి ఇంటర్వ్యూ ఇవ్వమన్నాడు.

అప్పుడు నేను కాలేజీకి వెళ్లలేదు. టెన్త్ వరకే చదువుకున్నాను అని చెప్పాను. వెంటనే జోహో కంపెనీ మేనేజర్.. కాలేజీ డిగ్రీ అవసరం లేదని.. స్కిల్స్ అవసరం అని తెలిపారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చాను. అందులో పాస్ అయ్యాను. ఇప్పుడు అదే కంపెనీలో సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజినీర్ గా ఎదిగాను. నాకు సహకరించిన సీనియర్ ఉద్యోగి షిబు అలెక్సిస్, జోహో కంపెనీకి ధన్యవాదాలు" అని అహ్మద్ అలిమ్ లింక్ డిన్ లో ఎమోషనల్ పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications