ముఖ్యమంత్రి రాజీనామా: కుప్పకూలిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం
పాట్నా: బిహార్‌లో అధికారంలో ఉన్న జనత దళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతోన్నాయి. భాగస్వామ్య పార్టీ బీజేపీతో జేడీయూ తెగదెంపులు చేసుకుంది. జేడీ (యు) బీజేపీకి గుడ్‌బై చెప్పింది. జేడీ (యు) అధినేత, సంకీర్ణ కూటమి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ ఫగు చౌహాన్‌కు అందజేశారు.

ఎన్డీఏకు గుడ్‌బై..
కొద్దిసేపటి కిందటే ఆయన పాట్నాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుసుకున్నారు. దీనితో బీజేపీ-జేడీయూ ప్రభుత్వం కుప్పకూలినట్టయింది. ఇక జేడీయూ, ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతా దళ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. జేడీయూ-ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా మళ్లీ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్నారు. దీనితో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నుంచి జేడీయూ బయటికి వచ్చినట్టయింది.
Recommended Video


నెక్స్ట్ ఏంటీ..?
ఆ పార్టీకి చెందిన కేంద్రమంత్రులు రాజీనామా చేయనున్నారు. గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని అందజేసిన అనంతరం ఆయన రాజ్‌భవన్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఎన్డీఏ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉందంటూ తమ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ, శాసన సభ్యులు స్పష్టం చేశారని వివరించారు. వారి నిర్ణయం మేరకే తాను ఎన్డీఏ నుంచి బయటికి రావాల్సి వచ్చినట్లు వివరించారు. ఇక తాము ఎలాంటి చర్యలు తీసుకుంటామనేది తొందరలోనే తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

రబ్రీ నివాసానికి..
రాజ్ భవన్ నుంచి నితీష్ కుమార్ నేరుగా రబ్రీ దేవి నివాసానికి బయలుదేరి వెళ్లారు. దారి పొడవునా ఆయనకు ఆర్జేడీ-జేడీయూ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రెండు పార్టీలకు చెందిన జెండాలను పట్టుకుని హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ కనిపించారు. రబ్రీ దేవి నివాసంలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌ను కలుసుకున్నారు. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన అంశాలపై చర్చించారు.

మరోసారి గవర్నర్‌తో..
ఈ సాయంత్రం నితీష్ కుమార్ మరోసారి గవర్నర్‌ను కలుసుకోనున్నట్లు తెలుస్తోంది. తేజస్వి యాదవ్‌తో కలిసి ఆయన గవర్నర్‌ను కలుస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆర్జేడీ శాసన సభ్యులు మద్దతు ప్రకటించినట్లు తెలియజేసే అవకాశం ఉంది. వారి సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు అందజేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జేడీయూ-ఆర్జేడీ కూటమిని ఆహ్వానించాలని విజ్ఞప్తి చేస్తారు.

అంతకుముందే పొత్తు ఖరారు..
ఇదే విషయంపై నితీష్ కుమార్-తేజస్వి యాదవ్ ఫోన్‌లో సంభాషించారు. పొత్తు విషయాన్ని నిర్ధారించుకున్నారు. పొత్తు ఖరారైన తరువాతే నితీష్ కుమార్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్డీఏ నుంచి బయటికి వస్తే తాము మద్దతు ఇస్తామంటూ ఆర్జేడీ, కాంగ్రెస్ హామీ ఇచ్చాయి. బీజేపీయేతర ప్రభుత్వం గనక ఏర్పాటైతే తాము బేషరతుగా మద్దతు ఇస్తామని బిహార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజిత్ శర్మ సైతం తెలిపారు. నితీష్ కుమార్ ఎన్డీఏ నుంచి బయటికి రావడాన్ని తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications