విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేడూ రికార్డులకెక్కిన పెట్రో ధరలు90: ఏ సిటీలో ఎంతంటే?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల కొనసాగుతోంది. శనివారం కూడా ఇంధన ధరలు మరింత పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. దేశ రాజధానిలో శనివారం పెట్రోల్‌ ధర 35పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 81.63కు చేరింది.

ఆల్‌టైమ్ హై! రూ.88.67: పెట్రో ధరలు ఏ సిటీలో ఎంతంటే? ఆల్‌టైమ్ హై! రూ.88.67: పెట్రో ధరలు ఏ సిటీలో ఎంతంటే?

ఇక డీజిల్‌ ధర కూడా 24పైసలు పెరిగి లీటర్‌ ధర రూ. 73.54గా ఉంది. ఇంధన ధరలు అత్యధికంగా ఉండే ముంబైలో పెట్రోల్‌ ధర రూ. 90కి మరింత చేరువైంది. శనివారం అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 89.01గా ఉంది. ఇక లీటర్ డీజిల్‌ ధర రూ. 78.07కు చేరింది.

Fuel price hike: Petrol at Rs 81.63/litre in Delhi, Rs 89.01/litre in Mumbai today

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 86.18, డీజిల్‌ ధర రూ. 79.73గా ఉండగా.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 85.41, డీజిల్‌ ధర రూ. 78.63కు చేరింది.
సెప్టెంబరు 5, సెప్టెంబరు 12 మినహా గత కొన్ని వారాలుగా ప్రతిరోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

ఆగస్టు మధ్య నుంచి ఇప్పటి వరకు లీటర్‌ పెట్రోల్‌పై రూ. 4.83, డీజిల్‌పై రూ.5 పెరిగింది. ముడిచమురు ధరలు పెరగడంతో పాటు ఎక్సైజ్‌ సుంకం ఎక్కువగా ఉండటంతో దేశీయంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

English summary
Fuel prices are continuing to set an all-time high record with each passing day across the country. Today, petrol price touched Rs 81.63 per litre (up by Rs 0.35 per litre) in New Delhi, and in Mumbai people will have to shell out Rs 89.01 per litre (up by Rs 0.34/litre), according to ANI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X