Petrol, Diesel ధరలు ఇంకా పైకి -ముంబైలో సెంచరీ మార్కు -Hyderabadలో ఈరోజు ఎంతంటే
దేశంలో కరోనా విలయం, లాక్ డౌన్ వల్ల జనం అల్లాడుతున్నా చమురు కంపెనీలు మాత్రం కనికరించడంలేదు. పెట్రోల్, డీజిల్ ధరల్ని మరోసారి పెంచేశాయి. రెండిటి ధరలను సమానం చేయాలనే లక్ష్యం దిశగా, పెట్రోల్ కన్నా డీజిల్ పై అధిక వడ్డన విధించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తొలి సారి లీటరు పెట్రోలు ధర రూ.100 మార్కును దాటేసింది..
ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ వదులుకున్న తర్వాత కంపెనీలే రోజువారీగా ధరలను నిర్ణయిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం నాటి పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) ఈ మేరకు ప్రకటన చేసింది. ఇవాళ లీటరు పెట్రోల్ పై గరిష్టంగా 26 పైసలు పెంచగా, డీజిల్ పై గరిష్టంగా 30 పైసలు పెంచారు. చివరిసారిగా ఈనెల 27న ధరలను పెంచిన కంపెనీలు మధ్యలో ఒకరోజు గ్యాపిచ్చి శనివారం మళ్లీ పెంపును ప్రకటించారు.

రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌పై లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటగా.. కొత్తగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. ఇంతకు ముందు గురువారం ధరలు పెరగ్గా.. శుక్రవారం విరామం తర్వాత శనివారం ధరలు పైకి కదిలాయి. తాజాగా పెంచిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.94, లీటర్ డీజిల్ రూ.84.89కి చేరాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.100.19, డీజిల్ రూ.92.17కు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర.97.63, లీటర్ డీజిల్ రూ.92.54కు చేరింది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొద్ది వారాల పాటు పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిలిపేసిన ఆయిల్ కంపెనీలు.. ఫలితాల తర్వాత మళ్లీ బాదుడు మొదలుపెట్టడం తెలిసిందే. ఎన్నికల ఫలితాల (మే 2) తర్వాత నుంచి ఇప్పటి దాకా లీటర్ పెట్రోల్‌పై రూ.3.61, డీజిల్‌పై రూ.4.11 ధరలు పెరిగాయి. ఇదిలా ఉంటే,
ఒపెక్ దేశాల మంత్రివర్గ సమావేశం జూన్ 1న జరుగనుంది. రాబోయే జూలైలో ముడి చమురు ఉత్పత్తిని పెంచుతారనే ఊహాగానాలున్నాయి. దీంతో ముడి చమురు మార్కెట్ ధరలు శుక్రవారం స్థిరంగా కొనసాగాయి. యూఎస్ మార్కెట్లో బ్రెంట్ ముడి శుక్రవారం బ్యారెల్‌కు 69.46 డాలర్లు పలికింది. డబ్ల్యూటీఐ క్రూడ్ బ్యారెల్‌కు 0.53 డాలర్లు తగ్గి.. 66.32 డాలర్లకు చేరుకుంది.
-
నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే! మీ నగరంలో రేటు ఎంత ఉందంటే? -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
గ్యాస్, పెట్రోల్, డీజిల్ పై ఏపీ వాసులకు సూపర్ న్యూస్.. మీకు దిగులు లేదు! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications