కుమార సర్కార్‌కు పదవీ గండం? విప్ జారీ చేసినా తిరుగుబాటు ఎమ్మెల్యేల గైర్హాజర్! జాబితా ఇదే!
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి సారథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమి ప్రభుత్వానికి పదవీ గండం తప్పేట్లు లేదు. స్పీకర్ రమేష్ కుమార్ విప్ జారీ చేసినప్పటికీ.. తిరుగుబాటు ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు. ఇదివరకే రాజీనామా చేసిన మొత్తం 18 మంది ఎమ్మెల్యేలూ డుమ్మా కొట్టారు. వారి రాజీనామాలను స్పీకర్ ఇంకా ఆమోదించలేదు. అయినప్పటికీ- బలపరీక్ష సందర్భంగా కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడటం ఖాయంగా కనిపిస్తోంది.
బలపరీక్షకు హాజరుకాని ఎమ్మెల్యేలు వీరే#KarnatakaTrustVote, #KarnatakaFloorTest #HDKumaraswamy pic.twitter.com/8CzkjL6lmV
— Oneindia Telugu (@oneindiatelugu) July 18, 2019
18 మంది వీళ్లే..
కాంగ్రెస్‌కు చెందిన 18 తిరుగుబాటు ఎమ్మెల్యేలు బలపరీక్షకు దూరంగా ఉన్నారు. ఎస్‌టీ సోమశేఖర్ (యశ్వంతపుర), బైరతి బసవరాజు (కృష్ణరాజపురం), రమేష్ జార్కిహోళి (గోకక్), మునిరత్న (రాజరాజేశ్వరి నగర), రోషన్ బేగ్ (శివాజీ నగర), హెచ్ విశ్వనాథ్ (హుణసూరు), మహేష్ కుమటహళ్లి (అథణి), ప్రతాప్ గౌడ పాటిల్ (మస్కి), కె సుధాకర్ (చిక్‌బళ్లాపుర), శివరామ్ హెబ్బార్ (ఎల్లాపూర్), శ్రీమంత్ పాటిల్ (కగ్వాడ), ఎంటీబీ నాగరాజ్ (హొసకోటె), నారాయణ గౌడ (కృష్ణరాజ పెటే), గోపాలయ్య (మహాలక్ష్మి లేఅవుట్), బీసీ పాటిల్ (హిరెకెరూర్), ఆనంద్ సింగ్ (విజయనగర), బీ నాగేంద్ర, ఆర్ శంకర్ (ముళబాగిలు)..వీరంతా అసెంబ్లీలోని ప్రస్తుతం కొనసాగుతున్న బలపరీక్షకు దూరంగా ఉన్నారు.

విప్ జారీ చేసినా..
కుమారస్వామి ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోవడానికి ఏర్పాటు చేసిన శాసనసభ సమావేశాలకు ఏకంగా 18 మంది గైర్హాజరు కావడంతో సంకీర్ణ సర్కార్ ఇబ్బందుల్లో పడిందనే అంటున్నారు. వారంతా రాజీనామా చేసిన వారే. వారిలో ఏ ఒక్కరి రాజీనామా కూడా ఆమోదం పొందలేదు. ఈ నేపథ్యంలో- ఆయా ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం సభ్యులుగా కొనసాగుతున్న వారే. దీనితో స్పీకర్ రమేష్‌కుమార్ విప్ జారీ చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో ప్రస్తుతం ఉన్న 116 మంది సభ్యులకూ విప్ వర్తిస్తుంది.












Click it and Unblock the Notifications