చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్లబ్‌లో ధోవతీ బ్యాన్: సిఎం జయలలిత హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: ధోవతి ధరించినవాళ్లను అనుమతించని క్లబ్‌లపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్రదాయ దుస్తులను ధరించి వచ్చే వాళ్లను క్లబ్‌లు అనుమతించకపోతే వాటి లైసెన్స్‌లు రద్దు చేశారు. ఆ విధమైన నిషేధం తమిళ సంస్కృతిని కించపరచడమేనని ఆమె అన్నారు. ధోవతికి తగిన గౌరవం లభించే విధంగా చట్టాన్ని తెస్తామని ఆమె చెప్పారు.

మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి హరిపరాంథమన్ సీనియర్ న్యాయవాదులు ఆర్ గాంధీ, జిఆర్ స్వామినాథన్‌లతో కలిసి ఓ పుస్తక ఆవిష్కరణ కోసం క్రికెట్ క్లబ్‌కు వెళ్లారు. ఆ పుస్తకాన్ని మద్రాసు హైకోర్టు మాజీ యాక్టింగ్ చీఫ్ జిస్టిస్ టిఎస్ అరుణాచలం రాశారు. వాళ్లు ధోవతులు ధరించడదంతో వారిని లోనికి అనుమతించలేదు.

Furious at Dhoti Ban in Clubs, Jayalalithaa Threatens to Cancel Licences

ధోతి ధరించిన కారణంగా ఓ న్యాయమూర్తిని చెన్నైలో చెపాక్ స్టేడియంలోని తమిళనాడు క్రికెట్ సంఘం క్లబ్‌లోకి రానీయకపోవడంపై తమిళనాడు శాసనసభలో దుమారం కూడా చెలరేగింది. సోమవారం శాసనసభలో తీవ్ర రభస జరిగింది. తమిళులకు అన్యాయం చేసినందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుని క్లబ్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

క్లబ్‌పై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో జయలలిత క్లబ్‌లకు హెచ్చరికలు జారీ చేశారు. అటువంటి క్లబ్‌లపై చర్యలు తీసుకునేందుకు చట్టం కూడా తెస్తామని చెప్పారు.

English summary

 The Dhoti ban is now a saga of epic proportions, with Tamil Nadu Chief Minister J Jayalalithaa declaring war on clubs that refuse entry to people wearing the traditional garment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X