G20 Summit 2023: భారత్ కు బైడెన్, రిషి సహా - భారీ ఏర్పాట్లు, అన్నింటా ప్రత్యేకం..!!
జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశానికి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగే ఈ సదస్సుకు ప్రపంచ దేశాల అధినేతలు తరలి వస్తున్నారు. వారికి అదిరిపోతే ఆతిథ్యం ఇచ్చేందుకు కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అమెరికా అధ్యక్ష హోదాలో జో బైడెన్..బ్రిటన్ పీఎం హోదాలో తొలి సారి రిషి సునాక్ భారత్ లో అడుగు పెడుతున్నారు. వీరితో పాటుగా ఇతర దేశాల అధినేతల కు బస నుంచి ప్రతీ అంశంలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.
జీ 20 సదస్సు వేళ ఢిల్లీ నగరం భద్రత వలయంలోకి వెళ్లింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా సహా పలు దేశాల ప్రధానులు, ప్రపంచ దేశాల అధినేతలు హాజరు కానున్నారు. దీంతో ఢిల్లీలో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. రాజధాని నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అతిథుల కోసం ప్రత్యేకంగా బస ఏర్పాట్లు చేశారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ నాలుగు రోజుల పాటు భారత్ లో ఉండనున్నారు. ఆయన కోసం హోటల్ ఐటీసీ మౌర్య లో బైడెన్‌కు వసతి కల్పించారు. రేపు భారత్ లో బైడెన్ అడుగు పెట్టనున్నారు.

హోటల్ లో అమెరికా అధికారుల కోసం 400 గదులు కేటాయించారు. మూడు అంచల భద్రత ఏర్పాటు చేసారు. శుక్రవారం ప్రధాని మోదీతో బైడెన్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అంతర్జాతీయ సమస్యలు, వాతావరణ మార్పులు, క్లీన్ ఎనర్జీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తదితర అంశాలపై ప్రపంచ దేశాల నేతలతో చర్చించనున్నారు. ఆ తర్వాత శని, ఆదివారాల్లో జీ20 అధికారిక సమావేశాల్లో పాల్గొంటారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రధాని హోదాలో తొలిసారి ఇండియాకు వస్తున్నారు. 43 ఏళ్ల రిషి షాంగ్రి లా హోటల్ లో బస చేయనున్నారు. కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడోస్ ప్రస్తుతం ఇండొనేషియా పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచి ట్రూడో నేరుగా ఢిల్లీకి చేరుకుంటారు. ది లలిత్ హోటల్‌లో ఆయన బస చేస్తారు.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ మూడు దేశాల్లో పర్యటించబోతున్నారు. అందులో ముందుగా ఇండొనేషియా, ఫిలిప్పీన్స్ సందర్శించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ చేరుకుంటారు. ఇక్కడ 9-10 తేదీల్లో జరగబోయే జీ20 సమ్మిట్‌లో పాల్గొంటారు. ఇక ఆంథోనీ.. ఇంపీరియల్ హోటల్ లో బస చేయనున్నారు. ఇక ఈ సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరు కావడం లేదు. అధ్యక్షుడి స్థానంలో ఆ దేశ ప్రధాని లి కియాంగ్ నేతృత్వంలో చైనా బృందం సమావేశాలకు హాజరుకానుంది. వీరందరికీ తాజ్ హోటల్ లో వసతి ఏర్పాట్లు చేశారు. దేశ రాజధానికి రానున్న ప్రతినిధులకు ప్రధాని మోడీ ఫొటోలతో స్వాగత తోరణాలు దర్శనమిస్తున్నాయి. ఆంక్షలతో సెంట్రల్ ఢిల్లీలో అనధికార లాక్‌డౌన్ కొనసాగుతోంది. లక్షమంది భద్రతా సిబ్భందితో సెంట్రల్ ఢిల్లీ పరిసరాలు శత్రుదుర్భేద్యంగా మారాయి.
-
Noida jinx: అక్కడికి వెళ్తే పదవి పోయినట్లేనా ? సెంటిమెంట్ పై మోడీ కామెంట్స్..! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications