ఢిల్లీ చర్చి ఫాదర్‌కు అరుదైన నాణెన్ని గిఫ్ట్‌గా ఇచ్చిన బైడెన్- ఏంటి దాని స్పెషాలిటీ?
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 శిఖరాగ్ర సదస్సు ఢిల్లీ వేదికగా ముగిసింది. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో రెండు రోజుల పాటు కొనసాగిన సమావేశం ఇది. ఈ మధ్యాహ్నం చివరి సెషన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. వచ్చే ఏడాది జరగబోయే జీ20 ప్రెసిడెన్సీని బ్రెజిల్‌కు అప్పగించారు.
మోదీ చేతుల మీదుగా ప్రెసిడెన్సీని ఆ దేశాధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డాసిల్వ అందుకున్నారు. 2024 నాటి జీ20 సదస్సును తమ దేశ రాజధాని రియో డి జనేరోలో నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. దీనికి అవసరమైన ఏర్పాట్లను ఇప్పటి నుంచే చేపడతామని, ఈ సదస్సుకు హాజరు కావాలంటూ సభ్యదేశాలను ఆహ్వానించారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మానుయెల్ మక్రాన్, చైనా ప్రధాని లి కియాంగ్, దక్షిణాఫ్రికా అధినేత సిరిల్ రమాఫోసా.. ఇలా జీ20 సభ్య దేశాధినేతలు, ప్రధానమంత్రులు పాల్గొన్నారు ఇందులో. ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయాన్ని తెలియజేశారు. దానిపై సంతకాలు చేశారు.
ప్రత్యేకించి.. జో బైడెన్- మోదీ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు, ఒప్పందాలపై అందరి దృష్టీ నిలిచింది. జీఈ జెట్ ఇంజిన్లు, న్యూక్లియర్ టెక్నాలజీ, పరిశోధన రంగంలో భారత్‌లోని ఐఐటీలతో అమెరికన్ యూనివర్శిటీలు కలిసి పని చేయడం వంటి అంశాలతో కూడిన ప్రతిపాదనలపై ఈ రెండు దేశాలు సంతకాలు చేశాయి.
జో బైడెన్ భారత్‌కు వచ్చిన సందర్భంగా ఢిల్లీ ఆర్చ్‌డియోసెస్ లిటర్జీ కమిషన్ కార్యదర్శి ఫాదర్ నికొలస్ డయాస్.. ప్రత్యేకంగా చర్చ్ సర్వీస్‌ను నిర్వహించారు. జీ20 సదస్సు విజయవంతం కావాలంటూ మాస్ ప్రేయర్స్‌ను చేపట్టారు. శనివారం రోజు రాత్రి ఆయన జో బైడెన్ బస చేసిన హోటల్‌కు వెళ్లి, ఆయనను కలుసుకున్నారు.
ఆయన సేవలను గుర్తించిన జో బైడెన్.. ఓ అరుదైన నాణేన్ని ఫాదర్ నికొలస్‌కు బహుమతిగా ఇచ్చారు. ఈ మధ్యాహ్నం భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఆయనకు ఈ నాణేన్ని అందజేసింది. ఈ నాణేంపై జోసెఫ్ ఆర్ బైడెన్ జూనియర్, అనే పేరు ఆయన సంతకం, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 46వ అధ్యక్షుడు అనే అక్షరాలు, 261 అనే అంకెలను ప్రింట్ చేశారు.
మరో వైపున అమెరికా అధ్యక్షుడి అధికారిక చిహ్నాన్నిముద్రించారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 260 మందికి మాత్రమే ఈ నాణెం అందిందని ఫాదర్ నికొలస్ తెలిపారు. 261 వ్యక్తిగా తనకు ఈ గుర్తింపు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. యూఎస్ ఎంబసీ అధికారులు దీన్ని తనకు అందజేశారని చెప్పారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications