G20 Summit: జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కల్ట్ కంటికి ఐప్యాచ్, కారణం ఇదే
న్యూఢిల్లీ: జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కల్జ్(Olaf Scholz).. ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశాలకు హాజరయ్యారు. జీ20 సమావేశాల వేదిక భారత మండపంలో ఉన్న కోణార్క్ వీల్ వద్ద శనివారం ఉదయం ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ షేక్ హ్యాండ్ ఇచ్చి స్వాగతం పలికారు. ఆ సమయంలో స్కల్జ్.. తన కంటికి ఐప్యాచ్ ధరించి ఉన్నారు.
భారత్ చేరుకున్న సమయంలోనూ తన కంటికి ఐప్యాచ్ ధరించే ఉన్నారు. అయితే, సాధారణంగా కంటి ఆపరేషన్ చేయించుకున్న వాళ్లు ధరించే నల్ల రంగు ప్యాచ్‌ను జర్మనీ ఛాన్సలర్ స్కల్జ్ తన కంటికి ధరించారు. అయితే దీనిపై ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు. 65 ఏళ్ల ఛాన్సలర్ గత వారం జాగింగ్ చేస్తూ కిందపడిపోయి గాయపడినట్లు ప్రతినిధి తెలిపారు. దీంతో ఆయన కుడి కన్ను దెబ్బతిన్నది.

మరోవైపు, జీ20 సమావేశాల నేపథ్యంలో వివిధ దేశాధి నేతలు శుక్రవారమే ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం భారత మండపంలో తొలి రోజు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జీ20లో ఆఫ్రికన్ యూనియన్‌ను శాశ్వత సభ్య దేశంగా ప్రతిపాదించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇందుకు అన్ని సభ్య దేశాలు అంగీకరించడంతో ఇక నుంచి జీ20లో ఆఫ్రికన్ యూనియన్ కూడా శాశ్వత సభ్య దేశంగా కొనసాగనుంది.
అంతకుముందు, శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ ముందుగా భారత్ మండపానికి చేరుకున్నారు. ఆయనకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ స్వాగతం పలికారు. సదస్సు షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.20 నుంచి 10.20 మధ్యలో వివిధ దేశాధి నేతలు, విదేశీ ప్రతినిధులు భారత్ మండపానికి చేరుకున్నారు. వీరందరికీ ప్రధాని మోడీ స్వయంగా స్వాగతం పలికారు.
#WATCH | G-20 in India: German Chancellor Olaf Scholz arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/PkBvhCKWEO
— ANI (@ANI) September 9, 2023
మరోవైపు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశాధినేతలు, ప్రపంచ ప్రతినిధులకు ట్విట్టర్ వేదికగా స్వాగతం పలికారు. 'జీ20 సభ్య దేశాధినేతలకు, అతిథి దేశాలకు, అంతర్జాతీయ సంస్థలకు ఢిల్లీలో జరుగుతున్న 18వ జీ20 సదస్సుకు స్వాగతం' అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, G20 గ్రూపులోని ఇతర నాయకులు అలాగే అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు, ఆర్థిక సహకార సంస్థ వంటి అనేక ప్రముఖ ప్రపంచ సంస్థల చీఫ్‌లు, అభివృద్ధి (OECD) సమ్మిట్ కోసం దేశ రాజధానిలో కలిశారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications