'ఆత్మహత్య చేసుకుంటుంటే స్పీచ్‌లా, గజేంద్ర మృతికి కేజ్రీవాలే కారణం'
న్యూఢిల్లీ: తన తనయుడు గజేంద్ర సింగ్ మృతికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కారణమని ఆత్మహత్య చేసుకున్న రైతు తండ్రి ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య పైన కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేసినప్పుడే ఆయన తప్పు చేశాడని అర్థమవుతోందన్నారు.
గజేంద్ర సింగ్ కూతురు కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే తప్పు పడుతున్నారు. గజేంద్ర సింగ్ కూతురు గురువారం మాట్లాడుతూ.. తన తండ్రి మృతికి ఏఏపీ కారణమన్నారు. తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడుతున్న సమయంలో ఏఏపీ నేతలు ప్రసంగం ఇవ్వడంలో బిజీ కావడం బాధాకరమన్నారు.
ఏఏపీయే బాధ్యత వహించాలన్నారు. తన తండ్రి అలాంటి ఘటనకు పాల్పడే వ్యక్తి కాదన్నారు. తమ తండ్రి చనిపోయినందున ప్రభుత్వం తమకు చదువు చెప్పించాలని, తమకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, తమను ఆదుకోవాలని విచార వదనంతో చెప్పారు.
గజేంద్ర మృతికి కేజ్రీవాల్ బాధ్యత వహించాలని ఆయన సోదరుడు విజేంద్ర సింగ్ డిమాండ్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్వయంగా తన సోదరుడికి ఫోన్ చేసి ర్యాలీకి హాజరుకావాల్సిందిగా కోరడంతోనే గజేంద్ర ఢిల్లీ వెళ్లారని తెలిపారు. వెళ్లే ముందు రైతు సమస్యలను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని చెప్పి వెళ్లిన గజేంద్ర చివరకు విగతజీవుడిగా తిరిగి వచ్చాడని కంటతడి పెట్టారు.

మరోవైపు, గజేంద్ర ఆత్మహత్యకు ఏఏపీ కార్యకర్తలను బాధ్యులను చేస్తూ ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యను ప్రేరేపించేలా వారు వ్యవహరించారని, పోలీసులు రక్షించే ప్రయత్నం చేసినా అడ్డుకున్నారని, చివరకు ఆస్పత్రికి తరలించే సమయంలోనూ అవరోధాలు కల్పించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఆత్మహత్యపై ర్యాలీ నిర్వాహకులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, ఏఏపీ నేతలనూ ప్రశ్నించే అవకాశముందని ఢిల్లీ పోలీసు కమిషనర్ బస్సీ తెలిపారు. ఏఏపీ సర్కార్ ఆదేశించిన మెజిస్టీరియల్ విచారణతో తమకు సంబంధం లేదన్నారు. రైతు ఆత్మహత్యపై ప్రాథమిక నివేదికను బస్సీ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అందజేశారు.
కాగా, ఏఏపీ ర్యాలీలో ఆత్మహత్యకు పాల్పడిన గజేంద్ర సింగ్‌కు రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. రాజస్థాన్‌లోని గజేంద్ర స్వగ్రామం నంగల్ ఝామర్‌వాడలో గురువారం జరిగిన అంత్యక్రియలకు రాజస్థాన్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లట్, రాజస్థాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ సహా పలువురు స్థానిక రాజకీయ నాయకులు హాజరయ్యారు.
సింగ్ పెద్ద కొడుకు బిట్టు తండ్రి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఢిల్లీలో గజేంద్ర ఆత్మహత్యపై నిరసనలు వెల్లువెత్తాయి. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు ధర్నా నిర్వహించారు.
రైతు ఆత్మహత్యకు ఏఏపీదే బాధ్యతంటూ నినదించారు. బీజేపీ కార్యకర్తలు కమిషనరేట్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ.. గజేంద్ర ఆత్మహత్య వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. కాగా, బీజేపీ గజేంద్ర కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం ప్రకటించగా, ఏఏపీ నేతలు రూ.10 లక్షలు ప్రకటించారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications