• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి కేసులో సుప్రీంకోర్టుకు 'మండింది'.. రోజువారీ విచార‌ణ‌కు ఆదేశాలు!

|
Google Oneindia TeluguNews

మీరెందుకు స్వ‌రం పెంచుతున్నారు మేడం? దానివ‌ల్ల మీకు మేలు జ‌ర‌గ‌దు.. పైగా కోర్టులో అలా చేస్తే ఎవ‌రికీ ఉప‌యోగ‌ప‌డ‌దు.. మీరేం చెప్పాల‌నుకుంటున్నారో చెప్పండి.. మేం ప‌రిశీలిస్తాం.. అంతేకానీ గొంతు మాత్రం పెంచొద్దు అంటూ సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎంఆర్‌షా గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి లాయ‌రు మీనాకీ అరోడాకు హెచ్చ‌రిక‌లు జారీచేశారు.

గాలి బళ్లారి వెళ్లేందుకు అనుమతివ్వండి

గాలి బళ్లారి వెళ్లేందుకు అనుమతివ్వండి

బళ్లారి వెళ్లకుండా ఉండేలా ఉన్న తన బెయిల్‌ షరతులను సడలించాలని కోరుతూ గాలి జనార్దన్‌రెడ్డి పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ సంద‌ర్భంగా జ‌స్టిస్ ఎంఆర్‌షా, జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం వ‌రుస‌గా రెండురోజులు కొన‌సాగించింది. గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె బిడ్డకు జన్మనిచ్చింద‌ని, దీనివ‌ల్ల ఆయ‌న నాలుగు వారాలు బళ్లారిలో ఉండేందుకు అనుమతించాలని విజ్ఞ‌ప్తి చేశారు. దానిపై తమకు సమాచారం లేదని సీబీఐ న్యాయవాది చెప్ప‌గా ఆ విషయాన్ని అధికారులు ధ్రువీకరించి చెప్పాలంటూ ధర్మాసనం త‌ర్వాత‌రోజుకు కేసు విచారణను వాయిదా వేసింది. సీబీఐ లాయ‌రు మాధవీ దివాన్‌ తమ నివేదికను కోర్టు ముందుకు తెచ్చారు.

 ఆవేశంగా స్పందించిన మీనాక్షి అరోడా

ఆవేశంగా స్పందించిన మీనాక్షి అరోడా


''జనార్దన్ రెడ్డి తన కుమార్తెను చూడటానికి బళ్లారి వెళ్లాలని అనుమతి కోరారు.. కానీ తమ పరిశీలనలో ఆయన కుమార్తె బ్రహ్మిణి బెంగళూరు రెయిన్ బో ఆసుపత్రిలో చేరారని, 27న సిజేరియన్ చేశారని, తర్వాత తన బిడ్డతో ఆమె బళ్లారికి చేరుకున్నారన్నారు''. సీబీఐ మరో స్థాయి కక్ష సాధింపునకు దిగిందని జనార్దన్‌రెడ్డి న్యాయవాది మీనాక్షీ అరోడా ఆవేశంగా స్పందించారు. ''బెంగళూరులో గాలి కుమార్తె ప్రసవించిన మాట వాస్తవమే. కానీ బళ్లారిలో బెంగళూరు స్థాయి ఆసుపత్రులు లేకపోవడంతోనే అక్కడికి వెళ్లారు. బళ్లారిలో ప్రసవమైనట్లుగా ఎలాంటి స్టేట్ మెంట్ చేయలేదన్నారు''. వెంటనే జస్టిస్ షా జోక్యం చేసుకొని ''మీరెందుకు గొంతు పెంచుతున్నారు మేడం.. అది మీకెప్పుడూ మేలు చేయదనగా'' వెంటనే ఆమె క్షమాపణలు కోరారు. ''మీరు చెప్పాలనుకున్నవి చెప్పండి.. కానీ గొంతు పెంచొద్దని న్యాయమూర్తి ఆదేశించారు. తర్వాత ఆమె బళ్లారి చిన్న పట్టణం కావడంతో బెంగళూరు తీసుకువెళ్లడం తప్పేం కాదన్నారు. దాన్ని తామేమీ తప్పు పట్టడంలేదని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాతే బళ్లారి తీసుువెళ్లినట్లు సీబీఐ తెలిపిందన్నారు ''.

రోజువారీగా విచారణ చేపట్టండి

రోజువారీగా విచారణ చేపట్టండి


బెంగళూరులో అమ్మాయి డెలివరీ అయినట్లు మీరు చెప్పలేదేంటని న్యాయమూర్తి ప్రశ్నించగా తనకు తెలిసివుంటే చెప్పేదానన్ని ఆమె అన్నారు. మళ్లీ ఆమె తన వాదనలు కొనసాగించబోతుండగా.. మీరు అన్ని వాదనలు వినిపించారని న్యాయమూర్తి అన్నారు. తొలుత బళ్లారికి చెందిన సాక్షులను విచారించాలని కోరగా అదంతా మీ ఊహేనని, ఈ కేసు విచారణను రోజువారీ చేపట్టాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆదేశిస్తున్నామంటూ న్యాయమూర్తి ఆమె వాదనను తోసిపుచ్చారు. దీనిపై ఈనెల 10వ తేదీన లిఖితపూర్వక ఉత్తర్వులు జారీచేస్తామన్నారు.

English summary
Supreme Court judge Justice MR Shah Gali Janardhan Reddy warned Meenaki Arora to not raise his voice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X