బీజేపీలోకి గాలి జనార్దన్ రెడ్డి?, అమిత్ షాతో భేటీ అందుకేనా, రెడ్డి దెబ్బకు కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు!

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్, కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ రాజకీయ చాణక్యుడు అమిత్ షాతో సమావేశమై చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో సుమారు 14 ఏళ్ల తరువాత గాలి జనార్దన్ రెడ్డి భేటీ కావడం హాట్ టాపిక్ అయ్యింది.

లోక్‌ సభ ఎన్నికల సమరానికి బీజేపీ సిద్ధం అయ్యింది. ఇప్పటికే గెలిచే అభ్యర్థుల కోసం బీజేపీ వెతుకుతోంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇతర పార్టీల నేతలను ఆకర్షించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భం కల్యాణ రాజ్యప్రగతి పార్టీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. ఢిల్లీ పర్యటన విషయాన్ని మాజీ మంత్రి, కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ అధ్యక్షుడు గాలి జనార్దన్ రెడ్డి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు.

Gali Janardhan Reddy had a special meeting with Union Minister Amit Shah

కేంద్ర మంత్రి అమిత్ షా ఆహ్వానం మేరకే తాను ఢిల్లీకి వెళ్లినట్లు గాలి జనార్దన్ రెడ్డి వివరించారు. కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ అధ్యక్షుడిగా తాను సమావేశమై కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన కొన్ని సమస్యలపై కేంద్ర మంత్రి అమిత్ షాతో చర్చించానని, ఆయనతో భేటీ కావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని గాలి జనార్దన్ రెడ్డి ట్విట్టర్ లో పోస్టు చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డితో అమిత్ షా భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేశారు. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ లతో గాలి జనార్దన్ రెడ్డిల మధ్య చర్చలు జరిగాయి. అలాగే అమిత్ షా ఆహ్వానం మేరకు అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్లిన గాలి జనార్దన్ రెడ్డి ఆయనతో కూడా సమావేశమై చర్చలు జరిపారు. వాస్తవానికి అమిత్ షా, గాలి జనార్దన్ రెడ్డి భేటీ కావడం తీవ్ర చర్చకు దారితీసింది

గతంలో బీజేపీలో ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత చాలా సంవత్సరాలు బీజేపీకి పూర్తిగా దూరం అయిన గాలి జనార్దన్ రెడ్డి 2022 డిసెంబర్ నెలలో బీజేపీ నుంచి బయటకు వచ్చి కల్యాణ రాజ్యప్రగతి పార్టీ పెట్టుకుని తరువాత ఎమ్మెల్యే అయ్యారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర బీజేపీ నేతలు పలువురు గాలి జనార్దన్ రెడ్డిని మళ్లీ బీజేపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.

Gali Janardhan Reddy had a special meeting with Union Minister Amit Shah

ఇప్పుడు అమిత్ షాతో చర్చలు జరిపి బీజేపీలోకి గాలి జనార్దన్ రెడ్డిని చేర్చుకునేందుకే అని ప్రచారం జరుగుతోంది. గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధమైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళ్యాణ కర్ణాటకలో అత్యంత పలుకుబడి ఉన్న నేత గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ బీజేపీలో చేరడం ద్వారా మరింత బలం పుంజుకుంటామని కర్ణాటక బీజేపీ నేతల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే రాజకీయ జీవితంలో భారీ పరాజయాన్ని చవిచూసిన గాలి జనార్దన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి ఒక్కరే ఆయన సొంత పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అమిత్ షాతో భేటీ సందర్బంగా రాజకీయ చర్చలు జరిగాయా ? లేదా ? అనే విషయంపై మాత్రం గాలి జనార్దన్ రెడ్డి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కర్ణాటకలోని కొన్ని సమస్యలపై మాత్రమే చర్చ జరిగిందని గాలి జనార్దన్ రెడ్డి అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించి బీజేపీ కంచుకోటను మరింత బలోపేతం చేసేందుకు గాలి జనార్దన్ రెడ్డిని కేంద్ర మంత్రి అమిత్ షా ఆయన్ను బీజేపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+